COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2nd Week July 2023 Rashifal Horoscope: ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మేషరాశిలో గురు, రాహు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇదే క్రమంలో కర్కాటక రాశిలో శుక్రుడు..ధనస్సు రాశిలో చంద్రుడు సంచారం చేయనున్నాయి. అంతేకాకుండా శని కుంభరాశిలో తిరోగమన దశలో చేరబోతున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై ఎప్పటికప్పుడు పడుతుందని జ్యోతిష్య శాస్త్ర  చెబుతున్నారు. ఈ సంచారాలతో జాతకంలో యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశుల వారు తీవ్ర ఇబ్బందుల బారిన పడితే మరికొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర సూచిస్తున్నారు. 


మేష రాశి:
మేష రాశి వారికి ఈ వారం మొత్తం లాభదాయకంగా ఉంటుంది. వీరు ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మేష రాశి వారికి ఈ వారంలోగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ సంచారాల కారణంగా పెట్టుబడి రెట్టింపుతో లాభం చేకూరుతుంది. 


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఇంతకుముందున్న పరిస్థితుల కంటే.. ఇప్పుడు మరింత అనుకూలంగా మారతాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. డ్రైవ్ చేసే క్రమంలో జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. 


మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. జీవిత భాగస్వామి అంచెలంచెలుగా ఎదిగే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా పనుల్లో ఆటంకం జరుగుతున్న వారికి ఈ వారం సమస్య తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ వారం సంతోషంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు ఉంటే ఈ క్రమంలో సులభంగా ఉపశమనం పొందుతారు.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం భిన్నంగా ఉండవచ్చు. ముఖ్యంగా మీ ప్రత్యర్ధులు చురుకుగా ఉండటం వల్ల మీకు హాని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు ఆరోగ్యం పట్ల తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.


సింహ  రాశి:
సింహ రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి పురోగతి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రవేత్త సూచిస్తున్నారు. ఈవారం వీరి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల సింహ రాశి వారు పాలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా లాభాదాయకంగా ఉండబోతుంది.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook