Rasi Phalalu 2024: 2024 సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాత సంవత్సరం కంటే కొత్త సంవత్సరం బాగుండాలని ప్రతి ఒకరూ కోరుకుంటారు. అయితే రాబోయే కొత్త సంవత్సరంలో చాలా రాశులు గ్రహ సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా శని గ్రహం కుంభరాశిలో సంచార దశలోనే ఉండబోతోంది. దీని కారణంగా మకర, కుంభ, మీన రాశులవారికి శని సాడేసతి ప్రభావం మరింత పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. 2024 సంవత్సరంలో శని ఎలాంటి తిరోగనమం చేయలేకపోవడం వల్ల ఈ మూడు రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో రాబోయే కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులు ఉండవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే 2024 సంవత్సరంలో కూడా మకర, కుంభ, మీన రాశుల వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మకరరాశి:
మకర రాశి వారు 2024 సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయం చిన్న చిన్న అశుభాలు జరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. సాడేసతి ప్రభావం కారణంగా ఆర్థిక సమస్యల బారిన పడొచ్చు. ఈ సంవత్సరంలో మకర రాశివారు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చర్చలకు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది. అంతేకాకుండా కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


కుంభ రాశి:
ప్రస్తుతం కుంభ రాశి వారికి శనిగ్రహ సాడే సతి కొనసాగుతోంది. ఈ ప్రభావం 2024 సంవత్సరంలో కూడా అలాగే ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు కొన్ని ఆర్థిక సమస్యలు ఎదర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుంభ రాశి వారు ఈ సమయంలో బయట ఇతర వ్యక్తులను నమ్మకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 


మీనరాశి:
మీనరాశికి కూడా ప్రస్తుతం శనిగ్రహం సాడేసతి ప్రభావం మొదటి స్టేజ్‌లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో కొన్ని సమస్యలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.  ఆరోగ్య సంబంధిత సమస్యల బారిన పడొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఆర్థిక అంశాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి చర్చలకైనా దూరంగా ఉండడ చాలా మంచిది. డబ్బులను అతిగా ఖర్చు మానుకోవాలి.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి