Chanakya Niti In Life: ప్రతి వ్యక్తి కష్టపడి తన గమ్యాన్ని చేరుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడిని ఓడించడానికి ఎంతో మంది శత్రువులు అడ్డుపడుతుంటారు. ఎలాగైనా అతడిని వెనక్కి లాగాలని వారు చూస్తుంటారు. విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు, మీ శత్రువులను సమయానికి ఎలా ఓడించాలో నేర్చుకోవడం చాలా ముఖ్యమని చెబుతోంది చాణక్యనీతి (Chanakya Niti). ఆచార్య చాణక్యుడి (Acharya Chanakya) చెప్పిన ఈ కింది 4 విషయాలు పాటిస్తే...ఎంతటి బలమైన శత్రువైన ఎన్నటికీ మిమ్మల్ని ఓడించలేడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు: ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. ఇలా చేస్తే, మీరు పోరాడకుండానే సగం యుద్ధంలో విజయం సాధిస్తారు. ఆ తర్వాత నీ గెలుపు ఖాయం.


శత్రువును బలహీనంగా పరిగణించవద్దు: చాణక్య నీతి ప్రకారం, శత్రువును బలహీనంగా భావించవద్దు. అతను మీ కంటే బలహీనుడైనప్పటికీ, అతని బలాన్ని బాగా అంచనా వేయండి. లేకుంటే మీరు బలహీనమైన శత్రువుతో కూడా ఓడిపోతారు. 


కోపంతో ప్రవర్తించవద్దు: ఎప్పుడూ తొందరపాటు, కోపం, అహంకారంతో నిర్ణయాలు తీసుకోకండి. అలాంటి నిర్ణయాలు మీకు హాని చేస్తాయి. ప్రతి అంశాన్ని కూల్ మైండ్‌తో ఆలోచించి, ఆపై డెసిషన్ తీసుకోండి. 


సహనం కోల్పోవద్దు: శత్రువుతో మీరు ఓడిపోతున్నప్పటికీ సహనం, సానుకూలతను వదులుకోవద్దు.  ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేం. శత్రువు చేసే చిన్న పొరపాటు మిమ్మల్ని గెలుపు అంచున నిలబెడుతుంది. కేవలం ఓపికతో ఆ తప్పును సద్వినియోగం చేసుకోవాలి. 


Also Read: Pickle: పచ్చడి తినడం ఆరోగ్యానికి మంచిదా లేదా చెడ్డదా? నిజం తెలుసుకోండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి