Holi 2023 Par Shani Guru Ka Shubh Sanyog: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు హోలికా దహనం చేస్తారు. దీని తర్వాత రోజు హోలీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలికా దహనం మార్చి 7న, హోలీ మార్చి 8న జరుపుకోనున్నారు. ఈ రెండు ఫెస్టివల్స్ నాడు గ్రహాల స్థానం స్పెషల్ గా ఉండబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభరాశిలో శని, సూర్యుడు మరియు బుధుడు కలయిక కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. 30ఏళ్ల తర్వాత ఇలాంటి యాదృచ్చికం ఏర్పడుతుంది. అంతకుముందు 1993లో హోలికా దహనం సందర్భంగా ఈ మూడు గ్రహాలు కుంభరాశిలో ఉన్నాయి. ఇదే సమయంలో గురుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇలాంటి సంఘటన పుష్కర కాలం తర్వాత ఏర్పడింది. హోలీ సందర్భంగా 2011 సంవత్సరంలో ఇలా బృహస్పతి తన సొంతరాశిలో సంచరించాడు. ఇన్ని అరుదైన సంఘటన కారణంగా రేర్ రాజయోగం ఏర్పడుతుంది. 


అంతేకాకుండా, కుంభరాశిలో సూర్యుడు మరియు బుధుడు కలయిక బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సారి ఈ యోగం వృషభ, శుక్ర, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇదే సమయంలో లవ్ గురు శుక్రుడు కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీంతోపాటు బృహస్పతితో సంయోగం జరిపాడు. మీనరాశిలో శుక్రుడు బృహస్పతితో కలవడం ముఖ్యంగా వృషభం మరియు తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.


Also Read: Trigrahi yog 2023: కుంభరాశిలో అరుదైన యోగం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.