Hindu New Year 2023:  ఈ సంవత్సరం హిందూ నూతన సంవత్సరం మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త ఏడాదికి రాజు బుధుడు మరియు మంత్రి శుక్రుడు. అంతేకాకుండా ఈ న్యూ ఇయర్ ఏర్పడిన రోజే 30 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం జరగబోతుంది. ఇదే రోజున కొన్ని ముఖ్యమైన గ్రహాల కలయిక, అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఇవాళే బ్రహ్మ దేవుడు విశ్వాన్ని  సృష్టించాడని నమ్ముతారు. ఇదే రోజు మహారాష్ట్రలో గుడి పడ్వా, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ నూతన సంవత్సరం మూడు రాశులవారికి బంపర్ ప్రయోజనాలను అందించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులకు వరం
వృషభం: వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 
సింహ రాశి : ఈ కొత్త సంవత్సరం సింహ రాశి వారికి కెరీర్ రంగంలో శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. 
తుల రాశి: ఈ హిందూ నూతన సంవత్సరం తుల రాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది. మీరు పదవి, గౌరవం మరియు డబ్బు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పురోగతి సాధిస్తారు. సంబంధాలు బాగుంటాయి. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. 
ఈ రాశుల వారు జాగ్రత్త..
మరోవైపు, కుంభం, మీనం, కర్కాటకం, ధనుస్సు, మిథునం మరియు వృశ్చిక రాశి ప్రజలకు ఈ సంవత్సరం మంచిది కాదు. ఈ రాశుల వారిపై శని సడే సతి కొనసాగుతుంది. 


Also Read: Guru Gochar 2023: శ్రీరామనవమి తర్వాత గురు-చండాల యోగం.. రాబోయే 6 నెలలపాటు ఈరాశులకు కష్టకాలం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK