Rajyog In Kundli: ఆస్ట్రాలజీ ప్రకారం, ఫ్లానెట్స్ రాశులను మార్చడం ద్వారా అరుదైన యోగాలు చేస్తాయి. మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 15న శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా 4 రాశుల సంచార జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి
రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 15న శుక్ర గ్రహం ఉచ్ఛస్థితిలో ఉండి మీ శుభ స్థానానికి వెళుతుంది. దీనితో పాటు శనిదేవుడు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తాడు. దీంతోపాటు శష్ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీరు కెరీర్‌లో ప్రమోషన్ మరియు మంచి ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. 
మిథున రాశిచక్రం
రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ అదృష్ట ఇంట్లో శనిదేవుడు ఉన్నాడు. మరోవైపు ఫిబ్రవరి 15న శుక్రుడు సంచరించిన వెంటనే కెరీర్‌లో మాళవ్య అనే రాజయోగం కూడా ఏర్పడనుంది. దీనితో పాటు హన్స్ అనే రాజయోగం ఏర్పడింది. దీంతో మీరు మంచి జాబ్ సాధిస్తారు. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. 
కన్య రాశిచక్రం
రాజయోగం కన్యా రాశి వారికి వృత్తి మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీరు రుణవిముక్తి నుండి బయటపడతారు. అంతేకాకుండా మాలవ్య, హన్స్ అనే రాజయోగాుల ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో లాభాలను పొందుతారు. వ్యాపారులు పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. 
తులా రాశిచక్రం
రాజయోగం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే శనిదేవుడు మీ సంచార జాతకంలో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. రానున్న కాలంలో మీ జీతాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. 


Also  read: Shani Surya Gochar 2023: మరో 2 రోజుల్లో శనిదేవుడిని మీట్ అవ్వనున్న సూర్యుడు.. ఇక ఈ 3 రాశులకు పండగే పండుగ.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook