Shani Surya Gochar 2023: మరో 2 రోజుల్లో శనిదేవుడిని మీట్ అవ్వనున్న సూర్యుడు.. ఇక ఈ 3 రాశులకు పండగే పండుగ..

Astrology: త్వరలో కుంభరాశిలో శని, సూర్యల కలయిక ఏర్పడబోతుంది. దీంతో 3 రాశుల వారికి సంపద అపారంగా పెరిగే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 04:16 PM IST
Shani Surya Gochar 2023: మరో 2 రోజుల్లో శనిదేవుడిని మీట్ అవ్వనున్న సూర్యుడు.. ఇక ఈ 3 రాశులకు పండగే పండుగ..

Shani And Sun Conjunction 2023: కర్మను ఇచ్చే శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీంతో మూడు రాశులవారు ఆకస్మిక ధనలాభాన్ని పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

తులా రాశిచక్రం
శని మరియు సూర్య భగవానుడి కలయిక తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ జాతకంలో ఐదవ ఇంట్లో జరగబోతోంది. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. మీ లైఫ్ పార్టనర్ తో బంధం మునుపటి కంటే బలపడుతుంది. దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. 
వృశ్చికం
మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో వృశ్చిక రాశివారు లగ్జరీ లైఫ్ ను లైడ్ చేస్తారు. ఏదైనా అస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కుంభం 
శని మరియు సూర్యుని కలయిక కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో లగ్న గృహంలో ఈ కూటమి ఏర్పడబోతోంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. మీరు పాత రోగం నుండి విముక్తి పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

Also Read: Budh Gochar 2023: త్వరలో మకరరాశిలో అరుదైన యోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News