Jadatva Yoga effect: 2024లో బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. కొత్త సంవత్సరంలో బుధుడు, రాహువు కలిసి అశుభకరమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఇది మూడు రాశులవారికి ఇబ్బందులను కలిగిస్తుంది.   ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మారుస్తాయి. వచ్చే ఏడాది గ్రహాల యువరాజైన బుధుడు మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. మార్చి 7వ తేదీ ఉదయం 9.40 గంటలకు ఈ ప్రక్రియ జరగబోతుంది. ఇదే సమయంలో రాహువు కూడా మీనరాశిలో ఉంటాడు. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అశుభకరమైన జడత్వ యోగం రూపొందుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులా రాశి..
ముఖ్యంగా ఈ రాశివారు ఎంత కష్టపడి ప్రయత్నించినా విజయం సాధించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.  మందస్తు జాగ్రత్త అవసరం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ యోగం మీ వైవాహిక సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఏ విధమైన అపార్థాన్ని నివారించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. . 


ఇదీ చదవండి: Magha Pournami 2024: రేపు ఈ ఒక్కపని చేస్తే 3 కోట్ల మందికి అన్నదానం చేసినంత పుణ్యం..


మీనం: ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి, అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదే రాశిలో జడత్వ యోగం ఏర్పడుతోంది. అందుకే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది, కాబట్టి మంచి డైట్ ఫాలోవ్వండి. జాబ్ చేసేవారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. మీకు లక్ అస్సలు కలిసిరాదు. 


ఇదీ చదవండి: Medaram Jathara 2024: భక్త జనసంద్రంగా మేడారం.. మహా జాతర ఫొటో గ్యాలరీ


మేషం: బుధ-రాహు కలయిక మేషరాశి వారికి సమస్యలను సృష్టిస్తోంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విభేదాలు తలెత్తుతాయి. మీరు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఏకాగ్రత, ఓపిక లోపం కనిపించే అవకాశం ఉంది.  మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోవచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. అప్పుల వారి బాధలు మీకు ఎక్కువ అవుతాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి