Magha Pournami 2024: హిందూ మతం ప్రకారం మాఘపౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు స్నాన, దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘపూర్ణిమ శివకేశవులను పూజిస్తారు. ఈరోజు మనం చేసే కొన్ని చర్యలు మన పూర్వజన్మల పాపాలను కూడా తొలగిస్తాయి.
మాఘపౌర్ణమి రోజు గోవుకు ఈ ఒక్కటి దానం చేస్తే కోటిదానాలు చేసినంత పుణ్యం. ఈ అవకాశాన్ని మీరు కోల్పోకండి. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసం ఎంతో విశిష్టమైన మాసం. ఈ మాసంలో వసంత పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, మహాశివరాత్రి వంటి శుభప్రదమైన పండుగలు వస్తాయి. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘపౌర్ణమి అంటారు. ఈ సమయంలో ఆలయాన్నీ కిటకిటలాడుతాయి. అంతేకాదు మాఘస్నానం ఉత్తమం. నదులు, సముద్రాలు పవిత్రతను సంతరించుకుంటాయి. ఈ పవిత్రమైనరోజున పారేనీటిలో స్నానం చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. ఇష్టదైవాన్ని పూజచేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో దేవతలు సర్వశక్తులు, తేజస్సును జలాల్లో ఉంచుతారు.
ఇదీ చదవండి: Medaram Jaggery Speciality: సమ్మక్క సారక్కకు బెల్లం ఎందుకు సమర్పిస్తారంటే..?
ఈ మాఘమాసంలో గోపూజ చేయడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆవును పూజించేటప్పుడు గంధం, కుంకుమలు, పూలతో పూజించాలి. ముఖ్యంగా గోవులకు అరటిపండు తినిపిస్తే ఋషులకు సమర్పించినట్లవుతుంది. గడ్డిని తినిపిస్తే సకల రోగాలు నయమవుతాయి. ఆహారాన్ని అరటిఆకుల్లో గోవుకు తినిపిస్తే ఏడుతరాలకు సరిపడా సంపద పొందుతారు. అప్పులపాలు అవ్వకుండా ఉంటారట. ఉదయాన్నే నిద్రలేచి గోవును చూడటం శుభప్రదం. గోమాతకు గరికెను ఆహారంగా వేస్తారు. మనం పెట్టే ఆహారాలు తినడం వల్ల సంతుష్టి చెందుతారు.
గోమాతకు బాగా అప్పుల్లో ఉన్నవారు కందులను నానబెట్టి పెడితే రుణబాధ నుంచి విముక్తి పొందుతారు. అరటిపండ్లు ఆహారంగా అందిస్తే ఉన్నత పదవి దక్కుతుంది. ఆవులకు బెండకాయను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. నానబెట్టిన శనగలను ఆవుకు పెడితే జీవితం సన్మార్గంలో నడుస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఇదీ చదవండి: Magha Pournami 2024: మాఘపూర్ణిమనాడు పొరపాటున ఈ 5 పనులు చేయకండి.. పితృదేవతలు శపిస్తారట..
కుటుంబంలో గొడవలు ఉన్నవారు ఆవులకు నానబెట్టిన పచ్చిశనగలను పెడితే కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మినపపిండి, బెల్లాన్ని ఆవుకు పెడితే ధనం బాగా కలిసివస్తుందట. గోధుమపిండి, బెల్లం కలిపి పెడితే ఉద్యోగప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లలు చదువులో రానించాలంటే నానబెట్టిన పొట్టుపెసరపప్పును ఆవుకు పెట్టాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter