After 9 days money will rain on These 3 zodiac signs due to Mercury Transit in Aries 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... బుధ గ్రహం ఇటీవలే మేష రాశిలోకి ప్రవేశించింది. ఇప్పుడు మేష రాశిలో బుధుడు అస్తమించబోతున్నాడు. తెలివితేటలు, సంపద, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైనవాటికి కారకుడిగా బుధుడిని పరిగణిస్తారు. బుధుడు ప్రజలందరి ఆర్థిక స్థితి, మాటలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాడు. 2023 ఏప్రిల్ 23 నుంచి బుధుడు అస్తమిస్తున్నాడు. అదే సమయంలో ఏప్రిల్ 21 నుంచి తిరోగమన కదలిక ఉంటుంది. బుధ గ్రహం యొక్క తిరోగమన చలనం, అస్తమించడం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంచిది కాదు. అయితే కొన్ని రాశుల వారికి ఇది అదృష్టాన్ని తెస్తుంది. ఏ రాశుల వారు ప్రయోజనాలను పొందుతారో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులా రాశి: 
బుధుడు అస్తమించినా తులా రాశి వారికి లాభాలను ఇస్తాడు. వ్యాపారస్తులు లాభపడగలరు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో సమస్యలు తగ్గుతాయి. ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోగలిగితే గొప్ప ప్రయోజనాలను పొందుతారు.


కన్యా రాశి: 
అస్తమించిన బుధుడు కన్యా రాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇస్తాడు. ఈ రాశి వ్యక్తులు పూర్తి అదృష్ట మద్దతును పొందుతారు. దాంతో ప్రతి పనిలో విజయం ఉంటుంది. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ-వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. పదవులు, ప్రతిష్టలు పొందుతారు.


కుంభ రాశి: 
కుంభ రాశి వారికి అస్తమించిన బుధుడు ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రతి పనిలో మీకు విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగాలు చేసే వారు గొప్ప విజయాన్ని పొందవచ్చు. కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. దుబారా ఖర్చులను నియంత్రించగలిగితే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.


Also Read: Surya Grahan 2023: సూర్య గ్రహణం 2023 రోజున 5 శుభ యోగాలు.. ఈ రాశుల వారికి పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్!  


Also Read: Gold Price Hike 2023: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర! ఆల్‌టైమ్ హై  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.