Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ ఎప్పుడు.. ఏ ముహూర్తం.. ఆరోజు ఏం చేయాలి..
అక్షయ తృతీయ 2022 ఈ సంవత్సరం ఏ తేదీన అక్షయ తృతీయ వస్తోందంటే ముహూర్తం, పూజ, ఆరోజు చేయాల్సిన వాటి గురించి పూర్తి వివరాలు
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ అంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించే తిథి అని అర్థం. తరగని అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే తిథిగా అక్షయ తృతీయ గురించి చెబుతారు. వైశాఖ మాసంలో రోహిణి నక్షత్రంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ వస్తుంది. ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా అక్షయ తృతీయ నాడు ప్రత్యేకించిన ముహూర్తం అవసరం లేదని చెబుతారు. ఈసారి అక్షయ తృతీయ మే 3న వస్తోంది.
అక్షయ తృతీయ శుభ ముహూర్తం :
తృతీయ తిథి మే 3 (మంగళవారం) 2022, ఉదయం 05:19 గంటలకు అక్షయ తృతీయ ప్రారంభమవుతుంది. మే 04 ఉదయం 07:33 గంటల వరకు కొనసాగుతుంది. మే 04వ తేదీ ఉదయం 12:34 గంటల నుంచి 03:18 గంటల వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది.
అక్షయ తృతీయ నాడు 'బంగారం' :
అక్షయ తృతీయ రోజు శుభ కార్యాలకు చాలా మంచిది. ఆరోజు కొత్త బట్టలు, ఆభరణాలు, ఇల్లు, కారు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండిని కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. కొద్ది మొత్తంలోనైనా ఈరోజు బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.
బంగారం కొనే స్తోమత లేకపోతే :
ఒకవేళ అక్షయ తృతీయ నాడు బంగారం కొనేంత స్తోమత లేకపోతే పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఆరోజు చక్కగా భగవంతుడికి పూజ చేసి.. భగవంతుడిని స్మరిస్తూ ఉపవాసం చేయాలి. ఉపవాసం అనంతరం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కలిగి సకల సంపదలు సిద్ధిస్తాయి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Petrol price: దేశంలో పెట్రోల్ రేటు ఏ ప్రాంతంలో తక్కువ? ఎక్కడ ఎక్కువ రేటు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook