Akshaya Tritiya 2022 Significance: అక్షయం అంటే అంతము లేనటువంటిది... వినాశనం కానటువంటిది... అనంతమైనది. వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిథి నాడు వచ్చేదే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు సింహాద్రి అప్పన్నకు 'చందనోత్సవం' జరుపుతారు. అంటే... పూర్వం నుంచి ఉన్న చందనం తొలగించి స్వామి వారి నిజరూపం దర్శనం కలగజేస్తారు. ఆ తర్వాత స్వామి వారిని మళ్లీ చందనంలో కప్పివేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ పురాణాల్లో అక్షయ తృతీయ :


హిరణ్య కశపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని  విష్ణు భక్తి మానుకోవాలని చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. చివరకు, సింహపు ముఖం వలె ఉన్నటువంటి సింహాచలం కొండ పైనుంచి ప్రహ్లాదుడిని సముద్రంలోకి తోసివేయాల్సిందిగా భటులను ఆజ్ఞాపిస్తాడు. హిరణ్య కశపుడి ఆజ్ఞాపన మేరకు భటులు ప్రహ్లాదుడిని సముద్రంలోకి తోసివేస్తారు. అయితే ప్రహ్లాదుడి మనస్సులో అప్పటికీ శ్రీరామన్నాయణను తలచుకుంటాడు. దీంతో సింహరూపం, వరాహ రూపంలో చిత్రమైన ఆకారంలో అప్పన్నగా శ్రీమన్నారాయణుడు ఆ కొండపై వెలిసి ప్రహ్లాదుడిని కాపాడుతాడు. ఇది సింహాచలం స్థల పురాణం.


అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా.. :


అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా.. వద్దా.. అంటే వద్దనే చెబుతున్నారు పండితులు. ఇది కేవలం వ్యాపార వర్గ ప్రయోజనాల కోసమే సృష్టించిన ప్రచారమని అంటున్నారు. 30, 40 ఏళ్ల క్రితం ఈ సాంప్రదాయం ఎక్కడా లేదని అంటున్నారు. అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు, ఆరాధనలు చేయడం... వైశాఖ పురాణాలు చదవాలని.. అంతే తప్ప బంగారం కొనాలని పురాణాల్లో ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. అప్పు చేసి బంగారం కొనడం అసలే చేయవద్దంటున్నారు. అక్షయ తృతీయ రోజు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ దేవిని చేపట్టిన రోజుగా చెబుతారు. కాబట్టి ఈరోజు విష్ణువు-లక్ష్మీ దేవతలను పూజించడం శుభం కలిగిస్తుందని.. అలాగే గణపతి ఆరాధన కూడా సకల శుభాలు కలగజేస్తుందని చెబుతున్నారు. ఈరోజు జలదానం, మజ్జిగ దానం, అన్నదానం, వస్త్ర దానం చేస్తే అక్షయమైన పుణ్యం లభిస్తుందని అంటున్నారు.


లక్ష్మీ దేవి ఆరాధన ఎలా చేయాలి. :


అక్షయ తృతీయ రోజు ఏ చిన్న మంచి పని చేసినా... అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈరోజున చేపట్టే పనులకు వర్జ్యం, దుర్ముహూర్తం చూసుకోవాల్సిన పని లేదు. ఇవాళ ఏ కార్యక్రమం ప్రారంభించినా అది బంగారు భవిష్యత్తుకు నాంది అవుతుంది. 


గృహంలోని పూజా గదిలో లక్ష్మీ దేవికి తామరవత్తులతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత లక్ష్మీ దేవి చిత్రపటం ముందు ఒక పీట వేసి పసుపు, కుంకుమ బొట్లు చల్లాలి. ఆపై బియ్యం పిండితో పీటపై పెద్ద చతురస్రాన్ని గీయాలి. మళ్లీ అందులో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు గీయాలి. ఈ చతురస్రాల్లో 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21 అనే సంఖ్యలు రాయాలి. ఆ సంఖ్యలపై రూపాయి బిల్లలతో పాటు, ఎర్రటి పుష్పాలను ఉంచాలి. దీన్ని కుబేర ముగ్గు అంటారు. అక్షయ తృతీయ నాడు ఏ ఇంట్లో అయితే ఈ కుబేర ముగ్గు ఉంటుందో అక్కడ లక్ష్మీ దేవి తాండవం చేస్తుందని పండితులు చెబుతున్నారు. కుబేర ముగ్గు వేశాక లక్ష్మీ దేవికి కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. 'ఓం శం కుబేరాయ నమ:' అనే శ్లోకాన్ని జపించాలి. లక్ష్మీ దేవిని ఇలా ఆరాధించడం వల్ల సకల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.


Also Read: Horoscope Today May 3 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం..


Also Read: SARKAARU VAARI PAATA : సీఎం జగన్‌ డైలాగ్‌తో క్రేజ్ పెంచిన మహేష్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.