Akshaya Tritiya 2023 Date: హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఇది ఈసారి ఏప్రిల్ 22న వచ్చింది. దీని తిథి రేపు ఉదయం 07:49 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 23 ఉదయం 07:47 వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం, ఏప్రిల్ 22నే అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ఏ సమయంలో కొనాలి?
ఏప్రిల్ 22న అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి అనుకూలమైన సమయం ఉదయం 07:49 నుండి ప్రారంభమై..ఏప్రిల్ 23 ఉదయం 05:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు గోల్డ్ మాత్రమే కాదు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు ఇల్లు, కారు లేదా భూమి. 
అక్షయ తృతీయ నాడే గోల్డ్ ను ఎందుకు కొనాలి?
అక్షయ తృతీయ నాడు మనం ఏ పని చేపట్టినా అది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ఇదే రోజున శుభకార్యాలు కూడా చేస్తారు. ఈ పవిత్ర దినాన బంగారం కొనడం, ఇల్లు లేదా కారు కొనడం, కొత్త ఉద్యోగం ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. అక్షయ తృతీయ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే రోజు. ఇవాళ పొందిన డబ్బు లేదా బంగారం శాశ్వతంగా మీ దగ్గర ఉండిపోతుందని నమ్ముతారు. ఈరోజున బార్లీని కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరంగా భావిస్తారు. 


Also Read: Guru Gochar 2023: మరో 24 గంటల్లో వీరి జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా? 


అక్షయ తృతీయ నాడు పంచగ్రాహి యోగం
అక్షయ తృతీయ రోజున అదృష్టాన్ని ఇచ్చే బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. పుష్కర కాలం తర్వాత గురుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. ఇతడు ఎంటర్ అవ్వడంతో అదే రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 


Also Read: Shukra Gochar 2023: మే 02న మిథున రాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశులకు లాభాలు బోలెడు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook