ఈ దీపావళికు ఓ అరుదైన ప్రత్యేకత ఉంది తెలుసా. ఇటువంటి దీపావళిని 40 తరాలకు ముందు చూశారు. మళ్లీ ఇప్పుడే చూస్తున్నారు. నమ్మశక్యంగా లేదా..నిజమే. శతాబ్దాల క్రితం చూసిన అద్భుత దీపావళి మళ్లీ ఇప్పుడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా దీపావళి పండుగ ( Diwali Festival ) అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.  దీపావళి రోజున ధనలక్ష్మి, వినాయకుడి పూజలు చేస్తారు. దీపావళి నాడు దనలక్ష్మి స్వయంగా భూమిపై వచ్చి..భక్తుల కోర్కెలు తీరుస్తుందని నమ్ముతారు. దీపాళ ఆవళి దీపావళి నాడు మహాలక్ష్మి పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల భక్తులు పూర్తి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజ చేస్తే.. ద్వారా సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. దీపావళి రోజు సాయంత్రం వేళ లక్ష్మీ పూజ చేస్తే శుభం కలుగుతుందని విశ్వాసం. Also read: AP: వైఎస్ జగన్ సరికొత్త ఆలోచన, విశాఖకు గోదావరి నీరు


ఈ దీపావళి అరుదైన దీపావళి..5 శతాబ్దాల అనంతరం మళ్లీ ఇదే


జ్యోతిష్యుల( Astrology ) ప్రకారం ఇవాళ్టి దీపావళి ప్రత్యేకత ఉంది. ఏకంగా 499 ఏళ్లు అంటే దాదాపు 5 శతాబ్దాల తరువాత..ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పటి నుంచి 40 తరాలకు ముందు  గ్రహాల అద్భుత కలయిక జరిగింది. అంటే 1521లో జరిగిన అద్భుతమిది. అమావాస్య నవంబర్ 14 మద్యాహ్నం 2 గంటల 17 నిమిషాలకు ప్రారంభమై..రేపు అంటే నవంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకూ ఉంటుంది. అంటే లక్ష్మీ పూజ నవంబర్ 14నే జరుగుతుంది. గ్రహాల ఈ అద్భుత ప్రత్యేక కలయిక వల్ల నవరాత్రుల ఆరంభం కూడా శనివారమే ఉంటుంది. జాతకాల ప్రకారం ఈ గ్రహాల కలయిక మంచిదని చెబుతారు. 


ఇవాళ్టి దీపావళికి మరో ప్రత్యేకత ( Diwali Speciality ) కూడా ఉంది. 32 ఏళ్ల తరువాత మరో విశేషం ఏర్పడింది. వాస్తవానికి దీపావళి నాడు  సర్వార్ధ సిద్ధి యోగం లభిస్తుంది. గతంలో అంటే 1988 నవంబర్ 9న కలిగింది. 32 ఏళ్ల తరువాత మళ్లీ...ఇప్పుడు సూర్యుడు, బుధుడు, చంద్రుడు తుల రాశిలో ఉన్నాయి. ఈ కారణంగా జాతకాల ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. 


1521లో...మళ్లీ ఇప్పుడే


దీపావళి నాడు అంటే ఇవాళ గురుడు, శుక్రుడు, శని ( Saturn ) గ్రహాల అసాధ్య కలయిక జరిగింది. ఇవాళ గురుడు ( Jupiter ) తనదైన ధనురాశిలో..శని తన రాశి మకరంలో ..ఇక శుక్రుడు కన్యారాశికి దిగువన ఉంటాయి.  గురుడు, శుక్రుడు, శని రాశుల ఈ అద్భుత సంయోగం 499 ఏళ్ల క్రితం అంటే 1521లో జరిగింది.  గురుడు, శని వ్యక్తి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే గ్రహాలుగా ఉంటాయి. Also read: Diwali 2020 Decoration In 30 Minutes: ఈ దీపావళికి 30 నిమిషాల్లో ఇంటిని డెకరేట్ చేసుకోండి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe