Anant Chaturdashi Visarjan Time: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపే వినాయక నిమజ్జనానికి చివరి రోజు. దీనినే అనంత చతుర్దశి అంటారు. ఈ రోజున మహావిష్ణువు యొక్క అనంత రూపాన్ని పూజిస్తారు. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి నాడు అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఈ రోజున ఆచారాల ప్రకారం, గణపతిని పూజించి.. నిమజ్జనం చేస్తారు.  ఈ రోజున ఇంట్లో సమస్యలన్నీ వినాయకుడి తీసుకెళ్తాడని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంత చతుర్దశి  శుభ సమయం
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి 28 సెప్టెంబర్ 2023 ఉదయం 06:12 గంటలకు ప్రారంభమై... 28 సెప్టెంబర్ 2023 సాయంత్రం 06:51 గంటలకు ముగుస్తుంది.
శుభ చోఘడియ - 06:12 నుండి 07:42 వరకు
చార్ చోఘడియ - 10:42 నుండి 12:11 వరకు
లబ్ చోఘడియా - 12:11 నుండి 01:30 వరకు
శుభ చోఘడియా - 04:41 నుండి 06:11 వరకు
రాహుకాలం - మధ్యాహ్నం 01:30 నుండి 03:20 వరకు


అనంత చతుర్దశి పూజా విధానం
నిమజ్జనం రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈరోజున గణపతికి ఎర్రచందనం, ఎర్రపూలు, దుర్వ, శెనగపిండి లడ్డూలు, తమలపాకులు, అగరుబత్తీలు మొదలైన వాటిని సమర్పించాలి. అనంతరం గణపతికి హారతి ఇవ్వాలి. వినాయకుడికి వీడ్కోలు పలికేటప్పుడు అతని మెడలో లడ్డూల దండ వేయాలి. నిమజ్జన సమయంలో నల్లని బట్టలు ధరించవద్దు. నిమజ్జన సమయంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. అంతేకాకుండా పూర్తి గౌరవంతో వీడ్కోలు పలకండి. 


Also Read: Mercury Transit 2023: ఒకే సారి రెండు ప్రత్యేక యోగాలు..ఈ రాశులవారికి అక్టోబర్ 1 నుంచి లాభాలే, లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook