Apara Ekadashi Vrat 2023: అపర ఏకాదశి పూజా సమయం, వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Apara Ekadashi Vrat 2023: అపర ఏకాదశికి రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Apara Ekadashi Vrat 2023: అపర ఏకాదశికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్య ఉంది. ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఈ నెలలో ఒకటి కృష్ణ పక్షంలో ఒక ఏకాదశి వస్తే మరొకటి శుక్ల పక్షంలో వస్తుంది. .జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరం అపర ఏకాదశి మే 15వ తేదీన వస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభిస్తుందని పూర్వీకుల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే అపర ఏకాదశి రోజున స్వామిని ఏ సమంలో పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శుభ సమయం:
తిథి ప్రారంభం: మే 15 మధ్యాహ్నం 02:46 గంటలకు ప్రారంభమవుతుంది.
శభ సమయం ముగింపు: మే 16 ఉదయం 01:03 గంటలకు..
వ్రత పరణ సమయం:
వ్రత పరణ సమయం ఉదయం 16 మే 06:4 నుంచి నుంచి 08:13 వరకు..
ముగింపు సమయం: ఉదయం 06:41
అపర ఏకాదశి పూజా విధానం:
వ్రతం ఆచరించేవారు తెల్లవారుజామూనే నిద్రలేవాల్సి ఉంటుంది.
ఇలా నిద్రలేచిన తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా తలస్నానం చేసి పట్ట వస్త్రాలు ధరించాలి.
మీకు దగ్గరలో ఉండే గుడికి వెళ్లి దీపం వెలిగించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా గంగాజలంతో విష్ణువు అభిషేక చేయాలి.
ముఖ్యంగా వ్రతం పాటించేవారు తప్పకుండా ఉపవాసం పాటించాల్సి ఉంటుంది.
వ్రతంలో శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది.
అపర ఏకాదశి ప్రాముఖ్యత:
అపర ఏకాదశి రోజున ఉపవాసాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
అంతేకాకుండా జన్మ జన్మల పాపాల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది.
పూర్వీకులు అందించిన సమాచారం ప్రకారం..పాండవులు కూడా అపర ఏకాదశి రోజున ఉపవాసం పాటించేవారట.
ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి