Travel Tips To Vaishno Devi Temple: వైష్ణోదేవి టెంపుల్ సందర్శించాలని ప్రతిఒక్క హిందు భక్తుడికి ఉంటుంది. ఈ ఆలయ ప్రయాణం ఎంతో ఆధ్యాత్మికంగాను, ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఈ ఆలయం జమ్మూ కశ్మీర్లోని కత్రాలో ఉంటుంది. మీరు కూడా వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. అక్కడికి వెళ్లాలంటే మీ వద్ద ఏం ఉండాలి? ఎలా ప్రయాణించాలి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుస్తు ప్రణాళిక..
వైష్ణోదేవి ఆలయ దర్శనానికి వెళ్లాల్సిన వారు కొన్ని నెలల ముందే ప్రణాళిక చేసుకోవాలి. అప్పుడే మీ ప్రయాణానికి ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది. అంటే ముందుగానే ట్రాన్స్‌పోర్ట్‌, బస, పర్మిషన్లు, పాసులు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తారు. నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్లి ఇబ్బుందులు పడుకుండా ఉండాలంటే ఈ ఆలయ దర్శనానికి ముందస్తు ప్రణాళిక తప్పనిసరి.


సరైన పాదరక్షాలు..
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాల్సిన వారు తమతోపాటు సరైన పాదరక్షలు కూడా తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ ఆలయం కొండ ప్రాంతంలో ఉంటుంది. ఎక్కువ సమయం నడవాల్సి ఉంటుంది. మంచి బూట్లు మాత్రమే ధరించండి. అయితే, కొత్త షూస్ వేసుకోకండి. ఎందుకంటే కొత్త షూస్ అసౌకర్యంగా ఉంటాయి.


ఇదీ చదవండి: అప్పులు పెరిగిపోతున్నాయా..? ఇలా చేయడం వల్ల ఆదాయ మార్గం తెరుచుకుంటుంది


వాతావరణ మార్పులు..
ఈ ప్రదేశంలో వాతావరణం తరచూ మారుతుంది. అంచనా వేయడం సులభం కాదు. అందుకే మీరు బుక్ చేసే తేదీ సమయానికి వాతావరణ మార్పులు ఎలా ఉంటాయో చూసుకోవాలి. దీనికి అనుగుణంగా దుస్తులు మీతోపాటు తీసుకెళ్లాలి. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే సందర్శకులు తమతోపాటు తప్పనిసరిగా రెయిన్ కోట్, గొడుగు వంటివి తీసుకెళ్లాలి.


హైడ్రేటేడ్..
ఈ ఆలయానికి వెళ్లాలంటే శరీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీళ్లు, జ్యూస్ ఎనర్జీ డ్రింక్స్, బార్స్ తీసుకుంటూ ఉండాలి. మీతోపాటు సరిపడా తాగునీరు, స్నాక్స్ కూడా తీసుకెళ్లండి.


ప్రాంతీయ సంప్రదాయం..
వైష్ణోదేవి ఆలయం ఎంతో పవిత్రమైన ప్రదేశం. అందుకే ప్రాంతీయతకు అనుగుణంగా వారి సంప్రదాయాలను పాటించడం మంచిది. వింతగా అరవడం, ప్రవర్తించడం వంటివి చేయకూడదు. లోకల్ ఆలమ అధికారులు కొన్ని  సూచనలు చేస్తారు. వాటికి అనుగుణంగా ప్రవర్తించడం మేలు.


మీ వస్తువులు జాగ్రత్త..
ఈ ఆలయానికే కాదు ఏ టూరిస్టు ప్రదేశాలకు వెళ్లినా మీ వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. అందుకే పెద్ద మొత్తంలో లగేజీ తీసుకెళ్లకండి. డబ్బు, విలువైన వస్తువులు మీ వద్ద ఉంటే మనీ బెల్ట్‌ లేదా నెక్ పౌచ్ వాడండి. వస్తువులను మీ దగ్గరే పెట్టుకోండి.


ఇదీ చదవండి: ఈ తేదీలో పుట్టినవారు ఇతరులతో పనిచేయించడంలో నిష్ణాతులు..


వైష్ణోదేవి ఆలయానికి నిత్యం పెద్దమొత్తంలో లక్షలమంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. ఇక పండుగల సమయంలో చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. రద్దీ ఎక్కువగా ఉండే ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ఓర్పు కూడా చాలా అవసరం. అంతేకాదు మీతోపాటు వచ్చిన మీ కుటుంబ సభ్యులతో దగ్గర్లోనే ఉండండి. మీరు ఎక్కడ ఉన్నది ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించండి. ముఖ్యంగా మీ ఫోన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకుని వెళ్లండి. మీతోపాటు అత్యవసర ఫోన్ నంబర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook