Facts About Dreams: సాధారణంగా రాత్రి పూట కొందరు బెడ్ మీద పడుకోగానే నిద్ర పడుతుంది. మరికొందరికి మాత్రం చాలా సేపటి వరకు కూడా అస్సలు నిద్రపట్టదు. అయితే.. కలలో కన్పించే సంఘటనలను బట్టి మన జీవితంలో కూడా కొన్ని ఫలితాలు కల్గుతాయి. కలలో.. కొందరికి తరచుగా ఏనుగు మీద ఎక్కినట్లు, గుర్రం మీద ప్రయాణించినట్లు వస్తుందంట. ఇది ఎంతో మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా.. రాబోయే రోజుల్లో జీవితంలో ఉన్నత స్థానాల్లో ఎదగడానికి ఇది సిగ్నల్ అని కూడా చెబుతుంటారు. అదే విధంగా కొందరి కలలో తన వాళ్లు లేదా తెలిసిన వారు చనిపోయినట్లు కూడా కలలు వస్తుంటాయి. ఇలా స్వప్నంలో చనిపోయినట్లు వస్తే వారికి ఉన్న దోషాలు పోతాయంట. అలాంటి వారు నిండు నూరేళ్లు కూడా ఎంతో ఆరోగ్యంతో జీవిస్తారంట. అదే విధంగా కలలో పెళ్లి చేసుకున్నట్లు కానీ, పంక్తి భోజనాలు కానీ పడితే చెడు ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా కొందరికి కలలో పాములు కూడా కన్పిస్తాయి. 


Also Read: Shani Dev: శనివారం ఈ 5 వస్తువులను ఇంట్లోకి అస్సలు తెచ్చుకోవద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?


పాములు కన్పిస్తే మంచిదే కానీ.. అది ఒకవైపు నుంచి మరోక వైపు పోయిందా.. లేదా కాటు వేసిందా... అనే దానిపై కూడా భవిష్యత్తులో మంచి, చెడు ఫలితాలు కల్గుతాయని చెబుతుంటారు. ఇంకా కలలో పారిజాతం, తులసీ చెట్టు, బిల్వపత్రం, రావి చెట్టు కన్పించడం ఎంతో మంచిదంట.


అదే విధంగా.. గుడ్లగూబ కన్పించిన కూడా మంచిది. కలలో మలం కన్పించిందా.. మీ జీవితంలో అస్సలు చూడని డబ్బులు మీ సొంతమవుతుందని చెబుతుంటారు. కొందరు కలలో మలంలో బొర్లినట్లు కూడా కన్పిస్తుందంట. అలాంటి వారికి డబ్బుల గంపలో పడతారని జ్యోతిష్యులు చెబుతుంటారు. అదే విధంగా కలలు కూడా ఉదయం బ్రాహ్మీ మూహుర్తం అంటే ౩ గంటల తర్వాత పడితే జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందంటారు.


చెడు కలలు కన్పిస్తే ఉదయం లేచీ తల స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని పూజలు చేస్తే చెడు స్వప్నం ప్రభావం ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. స్వప్నంలో కాకులు కన్పిస్తే ఇంటికి బంధువులు వస్తారంట.. అదే విధంగా చీమలు, క్రిమి కీటకాలు కన్పిస్తే, ఉదయాన్నే వాటిని ఏదైన చక్కెర లేదా ఆహారం పెట్టాలని కూడా జ్యోతిష్యులు సూచిస్తున్నారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook