Astology - Holi - Lunar Eclipse: ఈ సారి హోళి పండగ నాడు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అది కూడా దాదాపు ఒక శతాబ్ధం తర్వాత గ్రహ మండలంలో ఇలాంటి అరుదైన ఘటన చోటుచేసుకోబోతుంది. అయితే ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. ఈ చంద్ర గ్రహణం అర్ధరాత్రి మొత్తం 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. మన దేశంలో కనబడదు కాబట్టి మన ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోలీ నాడు చంద్ర గ్రహణం వల్ల ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉంటుందంటే..


మేష రాశి..
చంద్ర గ్రహణం మేషరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఇతరులతో మీ సంబంధాలు బలపడుతాయి. జీవిత భాగస్వామితో జీవితం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీవితంలో పురోభివృద్ధి సాధ్యమవుతుంది.



వృషభ రాశి..


హోలి నాడు చంద్ర గ్రహణం వల్ల వృషభ రాశి వారికి అనుకోని ధనలాభం కలిగి ఉండాలి. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.



సింహ రాశి..
సింహ రాశి ఈ చంద్ర గ్రహణం వల్ల అనుకోని లాభాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. కొన్ని విషయాల్లో అప్రమత్తత అవసరం. మీ పని అందరిచే కొనియాడబడుతోంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. దాన ధర్మాలు చేయండి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పనితీరు కనబరుస్తారు.



ధనుష్సు రాశి..
హోలి నాడు చంద్ర గ్రహణం వల్ల ధనుస్సు రాశి వారు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న పనులు నెరవేరుతాయి. విద్యార్ధులు, పోటీ పరీక్షల్లో పాల్గొనే వ్యక్తులు సానుకూల ఫలితాలు అందుకుంటారు. కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలను అందుకుంటారు.


మకర రాశి..


మకర రాశి వారికీ అనుకోని ధనలాభాలు కలుగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఈ చంద్ర గ్రహణం వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను అందుకుంటారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: నీ పక్కనే ఉన్నాయి మానవ బాంబులు... సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి