ShaniDev Remedies: నువ్వులు గురించి మన అందరికీ తెలిసిందే. వీటిని ఎక్కువగా మన వంటకాలలో భాగంగా ఉపయోగిస్తాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే నువ్వులకు జ్యోతిష్యశాస్త్రంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని మహాదశ నుండి బయటపడాలన్నా, శనిదేవుడి (lord shanidev) అనుగ్రహం పొందాలంటే నల్ల నువ్వులు ఎంతో అవసరం. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వుల పరిహారాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోయి మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది.  ఆ పరిహారాలు ఏంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరిహారాలు చేయండి
>> మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో (ముఖ్యంగా డబ్బుకు సంబంధించి) ఇబ్బంది పడుతుంటే... ప్రతి శనివారం పేదలకు నల్ల నువ్వులను దానం చేయండి. ఇలా చేయడం మీ మనీ కష్టాలు తీరడమే కాకుండా మీ వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది. 
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే.. మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. తద్వారా మీ పనులన్నీ విజయవంతంగా నెరవేరుతాయి. 
>> మీరు శని దోషం నుంచి విముక్తి పొందాలంటే....అమావాస్య రోజున పవిత్రంగా ప్రవహించే నదిలో నల్ల నువ్వులను వదలండి. ఈ పరిహారం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.


>> మీపై శని మహాదశ తొలగిపోవాలంటే...శనివారం నాడు, ఆవాల నూనెలో ఒక పిడికెడు నువ్వులను కలిపి శని దేవుడికి సమర్పించండి. దీని ద్వారా శని ధైయా నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. 
>> రాహు-కేతువులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా లేదా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా... ప్రతి సోమ, శనివారాల్లో నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి సమర్పించండి. ఈ సమయంలో ఖచ్చితంగా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ఈ రెమెడీతో మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయి. 
>> మీ ఇంట్లో తరుచూ తగాదాలు, గొడవలు జరుగుతుంటే...వాటిని పోగొట్టుకోవడానికి, పాలలో కొన్ని నల్ల నువ్వులు వేసి రావి చెట్టుకు పోయండి. ఈ సమయంలో మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ పరిహారంతో మీ ఇంటి కష్టాలు తొలగిపోతాయి. 


Also Read: Saturday remedies: శనివారం రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి, ఇక చూడండి మీ ఇంట డబ్బే డబ్బు..!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook