Saturday remedies: శనివారం రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి, ఇక చూడండి మీ ఇంట డబ్బే డబ్బు..!

Saturday remedies: శనివారం శనిదేవుడితోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. ఈ రోజున చేసే పూజలు మనిషికి మంచి ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 10:05 AM IST
  • శనివారం శనిదేవుడిని పూజిస్తారు
  • ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం మంచిది
Saturday remedies: శనివారం రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి, ఇక చూడండి మీ ఇంట డబ్బే డబ్బు..!

Saturday remedies: హిందూ క్యాలెండర్ ప్రకారం, శనివారం శనిదేవుడిని పూజిస్తారు. మనం చేసే పనులు బట్టి ఫలాలను ఇస్తాడు శని. మనం మంచి పనులు చేస్తే శుభ పలితాలు..చెడు పనులు చేస్తే శిక్షిస్తాడు శని దేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అని కూడా అంటారు. శనిదేవుడి (lord shanidev) అనుగ్రహం ఉండే మన జీవితంలో దేనికీ లేటు ఉండదు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం రాత్రికి ఈ పరిహారాలు చేయాలి. 

రాత్రిపూట ఈ పరిహారాలు చేయండి
>> శని దేవుడికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. మీరు శనివారం రాత్రి వీటిని ఇంట్లో వినియోగిస్తే శని దేవుడు సంతోషిస్తాడు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. 
>> మీరు శారీరక మరియు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే...శనివారం సాయంత్రం శనిదేవుని ఆలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించండి. దీపంలో నువ్వులు వేయాలి.
>> శనివారం సాయంత్రం రావి చెట్టు కింద పిండితో చేసిన నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించాలి. దీనితో పాటు పీపాల్ చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇది మీ జీవితంలో సానుకూలతను తెస్తుంది. అంతేకాకుండా శని దేవుడి అనుగ్రహం మీపై ఉంటుంది.  
>> శని దేవుడితో పాటు హనుమంతుడిని కూడా శనివారాల్లో పూజిస్తారు. ఈ రోజున అంజనేయస్వామి ఆలయానికి వెళ్లి నూనెతో దీపం వెలిగించండి. దీనితోపాటు హనుమాన్ చాలీసా పఠించడం కూడా ఎంతో ప్రయోజనకరం.

Also Read: Saturn Retrograde: శని తిరోగమనం.. ఆర్నెళ్ల పాటు ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. చేతి నిండా డబ్బే డబ్బు.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News