Rajayogam Effect: జూన్ 2022లో గ్రహ పరివర్తనాలు ఓ మహా సంయోగానికి దారి తీశాయి. బుధ, శుక్ర, శని గ్రహాలుక లిసి  పంచ మహాపురుష రాజయోగం సృష్టించాయి. అందుకే ఆ నాలుగు రాశులవారికి ఊహించని అద్భుతాలు జరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాలు రాశిమారడం ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ గ్రహాలు కలిసి యోగం సృష్టిస్తే..దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. జూన్ 18న నిన్న శుక్రుడు వృషభరాశిలో ప్రవేశిస్తూనే..పంచ మహాపురుష రాజయోగం సంభవించింది. ఈ రాజయోగం ఫలితం ఆ నాలుగు రాశులపై శుభప్రదంగా ఉంటుంది. ఆ జాతకస్థులకు గోల్డెన్ డేస్ వచ్చినట్టే ఇక. 


వృషభరాశిలో బుధ గ్రహం ముందు నుంచే ఉంది. జూన్ 18వ తేదీన శుక్రగ్రహం కూడా వృషభరాశిలో ప్రవేశించింది. అటు శని గ్రహం 30 ఏళ్ల తరువాత తనదైన కుంభరాశిలో ఇప్పట్నించే ఉంది. ఫలితంగా నాలుగు రాశుల గోచారంతో పంచ మహాపురుష రాజయోగం ఏర్పడింది. 


వృషభరాశి జాతకులకు కుండలిలో 2 మహా పురుష రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇది ఈ రాశివారికి కెరీర్‌‌లో అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్యాకేజ్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్ లభించే అవకాశాలున్నాయి. ఈ సమయం పదవి, డబ్బులు, ప్రతిష్ట మూడింటినీ తీసుకొస్తుంది. 


సింహరాశి వారి గోచారంతో కుండలిలో 2 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ స్థితి పని వ్యవహారాల్లో సాఫల్యాన్ని అందిస్తాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి కీలకమైన లాభముంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. పెట్టుబడులుకు అనుకూలమైన సమయం.


వృశ్చికరాశి వారి గోచారంతో కుండలిలో 2 మహా పురుష రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొత్త ఉద్యోగం, పదోన్నతి, జీతంలో పెరుగుదలకు కారణమౌతాయి. ఈ జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. పెద్ద డీల్ చేసే అవకాశాలున్నాయి. భవిష్యత్‌లో కీలకమైన లాభముంటుంది. మొత్తం నలువైపులా లాభాలే కన్పిస్తాయి.


కుంభరాశివారి గోచారం కుండలిలో మహా పురుష రాజయోగం ఏర్పరుస్తుంది. ఈ రాజయోగం ఫలితంగా బౌతిక సుఖాలు, ఐశ్వర్యం లభిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కొత్త కొత్త మార్గాల్నించి డబ్బులు రావడం ప్రారంభమౌతుంది. 


Also read; Zodiac Nature: మీ రాశిని బట్టి మీరు ఖర్చు చేసేవారా లేదా పిసినారి వారా చెప్పేయవచ్చు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.