Tulsi Remedies: ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా ప్రతి రోజూ తులసి మొక్కకు పూజలు చేసి నీరు పోస్తారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందనేది ఓ నమ్మకం. ప్రత్యేకించి ప్రతి గురువారం ఇలా చేస్తే మీ అదృష్టం దశ తిరిగిపోతుంది. డబ్బులతో మీ ఖజానా నిండిపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో తులసి మొక్కకు విశిష్టత ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ తులసి మొక్కకు పూజలు చేస్తుంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఆవాసముంటుందనేది ప్రధాన నమ్మకం. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కను తప్పకుండా ఉంచుతారు. రోజూ ఉదయం-సాయంత్రం పూజలు చేసి నీరు అభిషేకిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమైన ఇంట్లో సుఖ సంతోషాలు అందిస్తుందని అంటారు. తులసి మొక్కతో చాలా రెమిడీస్ ఉన్నాయంటారు జ్యోతిష్యులు. వీటిని గురువారం నాడు ఆచరిస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణువు ఆశీర్వాదం కూడా లబిస్తుందంటారు. పెద్దఎత్తున డబ్బులు సంపాదించాలంటే ఇది చేయడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో డబ్బులకు కొదవ రాదు. 


రావి చెట్టుకు పూజలు


ఏ నెలలో అయినా శుక్ల పక్షం గురువారం నాడు రావిచెట్టువి ఐదు ఆకులు తీసుకుని వాటికి చందనం లేపనం రాసి నదిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల సంపద లభిస్తుంది. గురువారం రోజున పుణ్యా నక్షత్రంలో గోరోచనాన్ని వెండి డబ్బాల ఉంచి  ధూపం వదిలి సింధూరం పెట్టి ఖజానాలో ఉంచాలి. దీనివల్ల డబ్బులకు ఎప్పుడూ కొదవ ఉండదు. 


ప్రతి గురువారం తులసి మొక్కకు పాలు పోయడం చేస్తే ఆ ఇంట్లో ధన సంపదలు వచ్చిపడతాయి.ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివాసముంటుందంటారు. గురువారం రోజున పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని గుడికి వెళ్లి తులసి మొక్క చుట్టూ ఉండే గడ్డిని అందులో చుట్టి ఇంట్లో ఖజానాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఈ ఇంట్లో అంతులేని ధన సంపద వచ్చి పడుతుంది.


ప్రతి గురువారం నాడు పుణ్య నక్షత్రంలో పసుపుకు ధూపమిచ్చి ఎర్రటి వస్త్రంలో చుట్టి ఖజానాలో ఉంచాలి. దీనివల్ల ఖజానాలో డబ్బు నిరంతరం పెరుగుతుంటుంది. ఇదే రోజున పుణ్య నక్షత్రంలో వెండితో చేసిన చిన్న డబ్బా నిండా నాగ కేసరి, తేనె నింపి ఖజానాలో ఉంచడం మరో పద్ధతి. ఇలా చేస్తే ఆష్ట ఐశ్వర్యాలు లభించి దారిద్య్రం దూరమౌతుందంటారు. 


Also read: September for Gemini: ఇలా చేస్తే చాలు సెప్టెంబర్ నెల మిధున రాశి జాతకులకు ప్రత్యేకం కానుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook