Venus Ast 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందుకే గ్రహాల రాశి పరివర్తనం గురించి ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడు శుక్రుడు సింహరాశిలో అస్తమించనుండటంతో కొంతమందికి ఊహించని లాభాలు వచ్చి పడనున్నాయి. ఆకస్మిక ధనలాభం కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి గ్రహానికి ఓ నిర్ణీత ప్రత్యేకతను ఆపాదించారు. అదే విధంగా శుక్ర గ్రహాన్ని ధన సంపదలు, ఐశ్వర్యానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఎవరైనా ఒక వ్యక్తి కుండలిలో శుక్రుడి స్థితి బాగుంటే..ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు. అంటే శుక్రుడు పటిష్టంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో లాటరీ తగిలినట్టే భావించాలి. అంతటి లాభాలు అనుకోకుండా వచ్చి పడతాయి. జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు 4వ తేదీన శుక్రుడు సింహ రాశిలో అస్తమించనున్నాడు. శుక్ర గ్రహం ప్రస్తుతానికి సింహ రాశిలో వక్రావస్థలో ఉన్నాడు. కొన్ని రాశులకు అదృష్టం కలిగేలా సహకారం అందిస్తున్నాడు. ఆగస్టు 4వ తేదీన శుక్రుడు సింహ రాశిలో అస్తమించడం వల్ల మరో మూడు రాశుల అధృష్టం వికసించనుంది. శుక్రుడు అస్తమించడం వల్ల ఏయే రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


శుక్రుడు ఆగస్టు 4వ తేదీన సింహరాశిలో అస్తమించనుండటంతో ఈ రాశివారికి ఈ సమయంలో పూర్తిగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. షేర్ మార్కెట్, జూదం, లాటరీ రంగాల్లో ఊహించని లాభాలుంటాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. ఈ సమయంలో చేపట్టే కార్యక్రమాలు విజయవంతమౌతాయి. 


హిందూమతం ప్రకారం ఆగస్టు 4న శుక్రుడు సింహ రాశిలో అస్తమించడం వల్ల భౌతిక సుఖాలు పెరుగుతాయి. లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ప్రేమ, ఆకర్షణ అధికమౌతాయి. శుక్రుడు అస్తమించడడం వల్ల ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇతరులతో సంబంధాలు అద్బుతంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడటంతో ఎలాంటి ఇబ్బందులుండవు. లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయవచ్చు.. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది.


సింహ రాశిలో శుక్రుడి ఆస్తమయంతో కర్కాటక రాశివారికి  గోల్డెన్ పీరియడ్ ప్రారంంభమైందని చెప్పవచ్చు. ఈ రాశివారి వ్యక్తిత్వం బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల్ని ఆర్జిస్తాయి. శుక్రుడి అస్తమయం ఇతర రంగాల్లో మీకు విజయాన్ని అందిస్తుుంది. పెళ్లి జీవితం బాగుంటుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులుండవు. ఆరోగ్యపంరగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 


Also read: Daridra Yoga: దరిద్ర యోగంతో ఈ రాశులవారి జీవితాలు మరింత హీనంగా మారబోతున్నాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook