దేవగురువు గురుడి కటాక్షం జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కుండలిలో గురువు శుభ స్థితిలో ఉంటే జీవితంలో అంతులేని ధన సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయి. గురు మహాదశ ఏకంగా 16 ఏళ్లు ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవితంలో అన్ని విధాలా అదృష్టం తోడవాలంటే గురుడి కటాక్షం ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి గ్రహం మహాదశ, అంతర్దశ రెండూ ఉంటాయి. గురు మహాదశ అయితే ఏకంగా 16 ఏళ్ల పాటు ఉంటుంది. వ్యక్తి జీవితంలో కుండలిలో గురుడు పటిష్టంగా ఉంటే..గురు మహాదశ ఉంటే..అతడి అదృష్టం వికసిస్తుంది. గురు మహాదశ సమయంలో అంతులేని ధన సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయి.


గురు మహాదశ అంటే ఏమిటి


గురు గ్రహంలో ఇతర గ్రహాలైన శని, బుధ, గురువుల అంతర్దశ నడుస్తుంటే..అందుకు తగ్గట్టే శుభ  అశుభ పరిణామాలు కలుగుతుంటాయి. ఒకవేళ గురుడి మహాదశలో గురు అంతర్గశ ఉంటే..ఆ వ్యక్తి సౌభాగ్యం పూర్తిగా లాభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతానం కలుగుతుంది. అన్ని కోర్కెలు నెరవేరుతాయి.


జీవితంలో గురువు శుభ ప్రభావం


గురు మహాదశ జాతకం జీవితంలో చాలా మార్పులు తెస్తుంది. గురు మహాదశ ఉన్నప్పుడు వ్యక్తికి పూజాది విషయాల్లో ఏకాగ్రత ఉంటుంది. చదువులో మంచి ఫలితాలుంటాయి. అంతులేని ధన సంపద లభిస్తుంది. డబ్బుల కొరత ఉండదు. అన్ని రకాల సుఖాలు లభిస్తాయి. అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. సంతాన సుఖం ఉంటుంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. 


జీవితంలో గురువు దుష్ప్రభావం


ఒకవేళ గురువు జన్మకుండలిలో అశుభ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి జాతకంలో గురు మహాదశ సందర్భంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూజాది కార్యక్రమాల్లో ఏకాగ్రత లోపిస్తుంది. చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ప్రాణాంతక వ్యాధులు రావచ్చు. వైవాహిక జీవితంలో పలు సమస్యలుంటాయి.


గురు గ్రహాన్ని పటిష్టం చేసే ఉపాయాలు


గురుడిని పటిష్టం చేసేందుకు గురువారం నాడు వ్రతం ఆచరించారు. బృహస్పతి దేవుడి ఉపాసన చేయాలి. గురువారం నాడు స్నానం చేసే నీళ్లలో పసుపు కలిపి స్నానమాచరించాలి. దీనివల్ల సౌభాగ్యం పెరుగుతుంది గురువారం నాడు ఆలయానికి వెళ్లి ఆరటి చెట్టును పూజించడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. దాంతోపాటు పేదలు, ఆపన్నులకు సహాయం చేయాలి.


Also read: Astro Tips: గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే..ఈ కిచెన్ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook