Rahu Ketu Remedies: మీరు రాహు-కేతు దోషంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి
Rahu Ketu Remedies: మీరు రాహు-కేతు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారా? అయితే రాహు-కేతు దోషాలను పోగొట్టుకోవడానికి ఈ పరిహారాలు చేయండి.
Rahu Ketu Remedies: జాతకంలో రాహు-కేతువుల దోషాలు ఉన్న వ్యక్తులు జీవితాంతం సమస్యలను ఎదుర్కోంటారు. వీరిని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. అనారోగ్యం, మానసిక ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కొంటారు. అందుకే కుండలిలోని రాహు కేతు దోషాల యెుక్క అశుభఫలితాలను నివారించడానికి ఆస్ట్రాలజీలో కొన్ని పరిహారాలు (Rahu Ketu Remedies) చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
రాహు-కేతు దోషాన్ని తొలగించే నివారణలు:
>> మీరు రాహు-కేతువుల దోషాలతో బాధపడుతుంటే.. నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయికి పెళ్లి చేసేందుకు ఆర్థిక సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల రాహు-కేతువుల యెుక్క అశుభ ప్రభావాలు తగ్గుతాయి.
>> రాహు-కేతులను ప్రసన్నం చేసుకోవడానికి, ప్రతి ఆదివారం గోమేధిక రత్నాన్ని ధరించండి. ఈ రత్నం రాహు గ్రహానికి చాలా ప్రియమైనది. దీనిని ధరిస్తే రాహువు మిమ్మిల్ని అనుగ్రహిస్తాడు. దీంతోపాటు ప్రతిరోజూ 5 నిమిషాల పాటు రాహు-కేతువులకు సంబంధించిన బీజ మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు క్రమంగా తొలగిపోతాయి.
>> రాహు-కేతువులను ఛాయా గ్రహాలు అంటారు. నిత్యం దుర్గామాతను పూజించడం వల్ల రాహు, కేతు గ్రహాల జాతక దోషాలు తొలగిపోతాయి.
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కేతు గ్రహానికి ఆకుపచ్చ రంగు చాలా ప్రియమైనది. కాబట్టి, మీ జాతకంలో కేతువు దోషం ఉంటే, మీరు ఎల్లప్పుడూ మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచుకోవాలి. అలాగే ప్రతి ఆదివారం ఆడపిల్లలకు పాయసం, పెరుగు నైవేద్యంగా పెట్టండి. ఈ పరిహారం కేతువు యొక్క దోషం తగ్గించడానికి సహాయ పడుతుంది.
>> మీ జాతకంలో రాహు-కేతువుల దోషాలు తొలగిపోవాలంటే మీ ఇంటి పూజాగదిలో శ్రీకృష్ణుడు శేషనాగుడిపై నృత్యం చేస్తున్న చిత్రపటాన్ని ఉంచి రోజూ పూజించండి. పూజ చేసేటప్పుడు 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల ఈ రెండు గ్రహాల అశుభాలు తొలగిపోతాయి.
రాహు-కేతు లక్షణాలను ఇలా గుర్తించండి..
మీరు తరచుగా దారిలో చనిపోయిన బల్లులు, పాములు లేదా పక్షులను చూస్తుంటే... కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఆర్థిక నష్టం పెరుగుతోంది. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ఇంట్లో ఉంచిన వస్తువులను పదేపదే పోగొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ రాహు-కేతు యెుక్క లక్షణాలు.
Also Read: Venus Transit 2022: కన్యారాశిలోకి శుక్రుడు.. మరో 2 రోజుల్లో ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook