Guru Grah Mahadasha: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలిక, సంచార, మహాదశ మరియు అంతర్దశ మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపుతాయి.  ఒక వ్యక్తి యెుక్క జాతకంలో ఈ దశలు శుభస్థానంలో ఉంటే వారు అపారమైన పురోగతిని సాధిస్తారు. అంతేకాకుండా వీరి ప్రతి కోరిక నెరవేరతుంది. ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. సాధారణంగా గురుమహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. కుండలిలో గురువు బలమైన స్థానంలో ఉంటే వారి అదృష్టం పెరుగుతుంది. జీవితంలో సానుకూల మార్పు ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతకంలో గురు శుభ స్థానంలో ఉంటే..
ఎవరిపై బృహస్పతి యొక్క మహాదశ కొనసాగుతుందో వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వీరు లెక్కలేనంత డబ్బును పొందుతారు. ఆర్థికంగా మీరు బలపడతారు. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. నెగిటివ్  ఆలోచనల నుంచి బయటపడతారు. విద్యారంగంలో ఉన్నవారు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటారో వారు ఇతరులను ఆకర్షిస్తారు. మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. కెరీర్ లో చాలా లాభాలు ఉంటాయి.  మీకు డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు. 


జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉంటే..
జాతకంలో కుజుడు అశుభ స్థానంలో ఉన్న వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. మీ కెరీర్‌లో అడ్డంకులు ఉంటాయి. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు.  ఆరోగ్యం క్షీణిస్తుంది.  


ఈ పరిహారాలు చేసుకోండి..
దేవగురువు బృహస్పతి యొక్క బలహీనమైన లేదా అశుభ స్థితిలో ఉన్న వ్యక్తులు గురువారం ఉపవాసం ఉండాలి. ఈ రోజున పసుపు మిఠాయిలు లేదా శనగపిండి మరియు పసుపుతో చేసిన ఏదైనా వస్తువును సేవించడం శ్రేయస్కరం. నీటిలో పసుపు వేసి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించండి. గురువారం అరటి చెట్టుకు పూజ చేసి పసుపు, బెల్లం, శనగపప్పు సమర్పించాలి. గురువారం రోజు పప్పు, అరటిపండ్లు మరియు పసుపు మిఠాయిలను దానం చేయడం వల్ల కూడా గురువు స్థానం బలపడుతుంది.


Also Read: Happy Pongal 2023: మకర సంక్రాంతి రోజున నీటితో ఇలా చేస్తే.. మీకు తిరుగులేనంత అదృష్టం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి