Money Astro Tips: ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంచుకోండి.. కష్టాలు కనిపించకుండా పోతాయి
Astro Tips In Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకుంటే ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఏ వస్తువును ఇంట్లో ఉంచుకోవాలో ఓసారి తెలుసుకోండి.
Astro Tips In Telugu: సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా వాస్తు ఆధారంగా ఇప్పటికి చాలా పనులు జరుగుతున్నాయి. ఇళ్లు కొనాలని అనుకున్నా.. స్థలం కొనాలని అనుకున్నా వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటారు. ఇక మహాభారతంలో శ్రీ కృష్ణుడు యుధిష్ఠిరుడికి వాస్తు జ్ఞానం ఇచ్చారు. శ్రీ కృష్ణ భగవానుడికి వాస్తు శాస్త్ర పరిజ్ఞానం చాలా ఎక్కువ. శ్రీకృష్ణుడి వాస్తు శాస్త్రం ఇంట్లో ఉంచినట్లయితే.. పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేయడమే కాకుండా.. ఇంటి నిండా ఆనందం నిండుకుంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఏయే వస్తువులను ఎక్కడ ఉంచాలో తప్పకుండా తెలుసుకోండి. ఏ దిశలో ఉంచాలో తెలుసుకోడం చాలా ముఖ్యం. ఏ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల లాభాలు ఉంటాయంటే..?
==> శ్రీ కృష్ణుడి ప్రకారం.. ఇంట్లో ధూపం, దీపం, పువ్వులు, సువాసన, నైవేధ్యాన్ని ఉంటే.. శుభప్రదంగా పరిగణిస్తారు. మీ ఇంట్లో ఈ వస్తువులను ఉంచినట్లయితే.. ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది.
==> ఇంట్లో వెలిగించే దీపం నెయ్యితో ఉండాలి. ఇంట్లో నెయ్యి అయిపోకూడదు. అంతేకాకుండా ఇంట్లో తేనె ఉండాలి. తేనె ఆత్మను శుద్ధి చేస్తుందని చెబుతారు. అందుకే పూజలో వాడుతూ ఉండాలి.
==> వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఈశాన్య లేదా ఈశాన్య దిశలో ఎల్లప్పుడూ నీటి వసతి ఉండాలి. ఈ దిశను దేవతల దిశగా చెబుతారు. ఈ విషయం మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంట్లో ఎప్పుడూ ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతారు.
==> హిందూ మతంలో తల్లి సరస్వతిని జ్ఞాన దేవత అంటారు. ఆమె విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే.. తెలివితేటలు, జ్ఞానం వృద్ధి చెందుతాయని చెబుతారు. శ్రీ కృష్ణుడు సరస్వతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలని సూచించారు. సరస్వతి తల్లి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే.. వ్యక్తి తెలివితేటలు పెరుగుతుంది. అంతేకాకుండా నిర్ణయాధికారం మెరుగుపడుతుంది.
(గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇతర సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook