Astrology - April Horoscope:ఏప్రిల్‌ నెలలో తెలుగు నూతన సంవత్సరాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఎదురు చూస్తోన్న విద్యా, ఉద్యోగ అవకాశాలు వశం కానున్నాయి. మొత్తంగా మేషం నుంచి మీనం వరకు ఏయే రాశుల వారికీ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..
ఈ రాశి వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న టైమ్ వీళ్లకు దగ్గర వచ్చేసింది. కెరీర్‌ పరుగులు పెడుతోంది. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇదే అనువైన సమయం. అంతేకాదు ఎంతో కాలంగా పెళ్లి కానీ యువతి యువకులు ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాటను అదుపులో ఉంచుకోండి..


వృషభ రాశి..
ఏప్రిల్ నుంచి మీ స్వం పనితీరుపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. కొన్ని ఒడిదుడుకలు ఎదుర్కొంటారు. జీవితం ఓ పరీక్షా కాలంగా సాగుతోంది. ఉన్న కెరీర్‌లో కొనసాగాలా.. వేరే కొత్త కెరీర్‌ను ఎంచుకోవాలనేది ఇపుడు డిసైడ్ చేసుకోవాలి. ఏది చేయాలనుకుంటున్నారో దానికి ఇదే అనువైన సమయం. ఏ విషయమైన ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.


మిథున రాశి..
మిథున రాశి వారికి ఏప్రిల్ నెల వీరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోభివృద్దికి ఇదే అనువైన సమయం. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో మీరు కనెక్ట్ కావచ్చు. శారీరక ఆరోగ్యం విషయంలో యోగాభ్యాసం, వ్యాయామాలు చేయడంపై దృష్టి సారించాలి.


కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి ఇది మంచి అనువైన సమయం. కెరీర్‌లో పరుగులు పెడుతోంది. ఎంచకున్న రంగాల్లో పురోభివృధ్ది సాధిస్తారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. ఈ కాలంలో ఏదైనా పని ప్రారంభిస్తే సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆర్ధికంగా స్థిర పడతారు. మెరుగైన వృద్దికి అవకాశం ఉంది. వృతిగత జీవితం.. వ్యక్తిగత జీవితాల మధ్య బ్యాలెన్స్ చేయడం ఉత్తమం.  


సింహ రాశి..
సింహ రాశి వారికి వ్యక్తిగతంగా మరియు మీ పనిచేస్తోన్న రంగాల్లో పురోగతికి ఇది ఎంతో అనువైన మాసం. మీరు మీ నైపుణ్యాల మెరుగుకు ఇదే సరైన సమయం. కొత్త వాటికి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్ధికంగా స్థితిమంతులవుతారు. అయితే డబ్బు ఖర్చు చేసే విషయంలో అప్రమత్తత అవసరం. తప్పుడు నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్త వహించాలి.


కన్య రాశి..
కన్యరాశి వారికి ఇది ఎంతో అనువైన సమయం. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం విషయంలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.


తుల రాశి..
గత కొన్నేళ్లుగా మనస్పర్ధలతో ఉన్న భార్యాభర్తలు తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇదే అనువైన సమయం. లాయర్స్, డాక్టర్స్, ఇతర వ్యాపార సంబంధ వృత్తుల్లో ఉన్నవారు తమ క్లైయింట్స్‌తో లాభదాయకమైన ప్రాజెక్ట్‌లకు తలుపులు తెరవడంలో ఎంతో దోహదం చేస్తోంది. అంతేకాదు వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందుకుంటారు. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారు.  


వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఈ నెలలో ఎంతో బిజీగా ఉంటారు. మీ జీవితంలో ఎదగడానికి ఇదే అనువైన సమయం. ఆర్దికంగా లాభాపడడానికి ఇదే అనువైన సమయం. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష.


ధనుస్సు రాశి..
ఏప్రిల్ నెలలో సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఈ నెల ఎంతో అద్భుతంగా సాగిపోనుంది. ప్రస్తుతం ఉన్న హోదా నుంచి నాయకత్వ పాత్రలో ప్రవేశించడానికి ఇదే గొప్ప ఛాన్స్. శృంగారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.


మకర రాశి..
మీ స్వంత ప్రపంచాన్ని సృష్టించడానికి ఇదే అనువైన సయమం. మీ దృష్టి దేశీయ సవాళ్లపై ఉన్నప్పటికీ మీ కెరీర్ వేగాన్ని తగ్గించలేదు. ఉద్యోగంలో ధీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. చేసే పనితో పాటు వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.


కుంభ రాశి..
ఏప్రిల్ నెలలో కుంబ రాశివారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా సాగిపోతుంది. మీరు కొత్త నైపుణ్యాలను సంపాదించడానికి ఉత్తేజపరచడానికి ఆసక్తి కలిగి ఉంటారు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయి. ఈ నెలలో చిన్న చిన్న ప్రయాణాలు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.


మీన రాశి..
ఈ మాసం మీకు ఆత్మగౌరవ భావాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదకారిగా పనిచేస్తోంది. స్ధిరమైన ఆర్ధిక వృద్ధికి తోడ్పడుతోంది. ఇతర స్టాక్ మార్కెట్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు మీకు ఎంతో సహాయకారిగా పనికొస్తాయి. ధీర్ధకాలిక లక్ష్యాల సాదనకు ఇదే అనువైన సమయం. సంబంధాలలో మీ అవసరాలు మరియు వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టడానికి ఇదే మంచి తరుణం.



Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి  ఈ విషయాన్ని  ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ప్రతిరోజు అల్పాహారంలో వీటిని తీసుకోండి చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook