Shani Sade Sati Remedies: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిదేవుడిని (Shanidev) న్యాయదేవుడిగా భావిస్తారు. శని పేరు వినగానే అందరూ భయపడతారు, కానీ శనిగ్రహం అందరినీ ఇబ్బంది పెడుతుందనే అభిప్రాయం తప్పు. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు. ఏ వ్యక్తి పైనైనా శని యొక్క సడేసతి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. శని గ్రహం యొక్క సడే సతి ప్రస్తుతం మూడు రాశులలో నడుస్తోంది. మెుదటి దశలో కుంభరాశిపై రాబోయే ఆరున్నర  సంవత్సరాలు. రెండోదశలో మకరరాశిలో మూడున్నర సంవత్సరాలు, చివరి దశలో ధనస్సులో ఏడాదిపాటు ఉంటుంది. శని సడేసతి యెుక్క పరిహారాలు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సడే సతికి పరిహారాలు
1. ఆస్ట్రాలజీలో దానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. కాబట్టి శనివారం నాడు ఇనుము, నల్ల ఉసిరి పప్పు, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. 
2. శనివారం నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి శని స్తోత్రాన్ని పఠించండి. దీంతో శని దేవుడు సంతోషిస్తాడు. 
3. శనివారం నాడు శనిదేవుని ఆలయానికి వెళ్లి ఆవాల నూనెలో నల్ల నువ్వులు, ఇనుప గోరు కలిపి శని దేవుడికి సమర్పించండి.
4. శనివారం ఆంజనేయుడిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పఠించడం కూడా శని దేవుడి అశుభ ఫలితాలను తగ్గిస్తుంది.
5. శనివారం రోజున చేపలు, పక్షులు, జంతువులకు ఆహారం ఇస్తే శని ప్రభావం తగ్గుతుంది.
6. ప్రతిరోజు నిస్సహాయులకు మీ సామర్థ్యాన్ని బట్టి దానం చేస్తే, శని దేవుడు అనుగ్రహం మీపై ఉంటుంది.


7. మీరు చీమలకు పిండి మరియు పంచదార పెట్టండి.
8. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.  
9. శనివారం ఉదయం మరియు సాయంత్రం భోజనంలో నల్ల ఉప్పు మరియు నల్ల మిరియాలు ఉపయోగించండి.
10. వీలైతే ప్రతి శనివారం కోతులకు కాల్చిన శనగలను తినిపించండి.
11. స్వీట్ బ్రెడ్‌ను నల్ల కుక్కకు తినిపిస్తే...శనిదేవుడు అనుగ్రహిస్తాడు.
12. మాంసం మరియు మద్యం తీసుకోవడం మానేయండి.


Also Read: సూర్య-శని సంసప్తక యోగం... ఆగష్టు 17 వరకు ఈ రాశులవారి జీవితం కష్టాలమయం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook