Samsaptak Yog Effect: సూర్యభగవానుడు,శనిదేవుడు ఇద్దరూ తండ్రీకొడుకులన్న సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం, వీరిద్ధరి మధ్య శత్రుత్వం ఉంది. సూర్యుడు జూలై 17న కర్కాటక రాశిలో ప్రవేశించాడు. అదే సమయంలో శని మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. దీంతో వీరిద్దరూ ముఖాముఖిగా వచ్చారు. ఈ రెండు ఎదురెదురగా ఉండటం వల్ల సంసప్తక యోగం (Samsaptak Yog ) ఏర్పడుతోంది. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో అశుభమైనదిగా భావిస్తారు. ఈ యోగం ఆగస్టు 17 వరకు మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి కష్టాలను కలిగించనుంది. దీని ప్రభావం వల్ల తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా వృద్ధుల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
అశుభ ఫలాలను తగ్గించే పరిహారాలు
>> ఆస్ట్రాలజీ ప్రకారం, సంసప్తక యోగం యొక్క అశుభ ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. దీని దుష్ప్రభావాలను నివారించడానికి.. ప్రతి రోజూ సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అదే విధంగా, శని యొక్క చెడు ప్రభావాలను తగ్గించడానికి...శనివారం ఆవనూనెను నైవేద్యంగా సమర్పించండి.
>> సూర్యభగవానుడు మరియు శని దేవుడి అనుగ్రహం పొందడానికి...వారి మంత్రాలను జపించండి.
>> సూర్య భగవానుడి దుష్ర్పభావాలను నివారించడానికి, ఆదివారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. నిరుపేదలకు గోధుమలు దానం చేయండి. అదే విధంగా, శని యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి...శనివారం నల్ల బట్టలు దానం చేయండి.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook