Rahu Ketu Dosh Remedies:  జ్యోతిష్యశాస్త్రంలో రాహు-కేతు గ్రహాలను అశుభమైనవిగా భావిస్తారు. ఇవి ఛాయా గ్రహాలు. అంతేకాకుండా ఈ రెండు ఏ రాశిని కలిగి ఉండవు. జాతకంలో రాహు-కేతు దోషం (Rahu Ketu Dosh) ఉంటే మీరు తీవ్ర ఇబ్బందులు గురవుతారు. అందుకే ఆ గ్రహాలను శాంతింపజేయడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదు. రాహు, కేతువుల అశుభ లక్షణాలు ఏమిటో, వాటి పరిహార మార్గాలేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బలహీనమైన రాహువు సంకేతాలు
ఏ వ్యక్తి జాతకంలో రాహువు బలహీన స్థితిలో ఉంటాడో అతడి లైఫ్ అనుహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. భయానక కలలు, మానసిక గందరగోళాలు కారణంగా మీకు నిద్ర పట్టదు.  సోమరిగా మారతారు. అతను ఏ పని మెుదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. 


బలహీన కేతువు సంకేతాలు
జాతకంలో కేతువు అశుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి ఎంత కష్టపడి పనిచేసిన ఇంట్లో డబ్బు నిలవదు. పేదరికం తాండవిస్తోంది. ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతాయి. కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన సమస్యలు వెంటాడుతాయి. 


రాహు-కేతు దోషాలను తొలగించే పరిహారాలు
>> రాహు-కేతు దోషాలను తొలగించడానికి దుర్గామాతను నిత్యం పూజించండి. వీలుకాకపోతే ప్రతి ఆదివారం అయినా ఆ తల్లిని ఆరాధించండి. ఈ పరిహారం జాతకంలోని రాహు-కేతువుల ఆగ్రహాన్ని తగ్గిస్తుంది.  
>>  రాహు-కేతు దోషాలను తొలగించడానికి.. 'ఓం రాన్ రాహవే నమః', 'ఓం కేత్వే నమః' అనే బీజ మంత్రాలను కనీసం 108 సార్లు జపించండి.
>>  రాహు-కేతువుల అశుభ ప్రభావాన్ని తొలగించడంలో 'ఓం నమో: భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం 108 సార్లు జపించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 
>>  కుక్కకు రోటీని క్రమం తప్పకుండా తినిపించడం అనేది రాహు మరియు కేతు దోషాలను తొలగిస్తుంది.
>> ప్రతి శనివారం పీపుల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం ద్వారా రాహు కేతువులతో పాటు శని గ్రహం శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది.
>>  రాహు-కేతు దోషాలను తగ్గించడంలో భోలేనాథ్ ఆరాధన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం, రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజూ కనీసం 108 సార్లు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించండి.


Also Read: Shani Margi 2022: మార్గి శని ఎఫెక్ట్.. ఈ 2 రాశులవారి అదృష్టం అదుర్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook