Astrology:  ముఖ్యంగా శని దేవుడి అశుభ దృష్టి ఆయా వ్యక్తులపై తొలిగిపోవడానికి మాఘ పౌర్ణమి రోజున స్నానం. ఆ తర్వాత పితృ దేవతలకు తర్పణం ఒదలాలి. దాంతో పాటు నువ్వులు, దుప్పటి, చెప్పులు, గొడుడు, ఆవు నెయ్యి, బెల్లం, వస్త్రాలు, శనగలు, మరియు ఇతర ఆహార పదార్ధాలు దానం చేయడంతో మీపై నవగ్రహాల దుష్ట ప్రభావం తొలిగిపోతాయిన నిర్ణయ సింధువు చెబుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా స్నానం అనంతరం.. ఉపవాసం పాటించడం.. సత్యనారాయణ స్వామిని పూజించడం.. హనుమాన్ లేదా మన ఇష్టదైవాన్ని ప్రార్ధించడం వంటివి చేయాలి. మాఘ పౌర్ణమి రోజున నారాయణుడు జలంలో ఉంటాడు. ఆ రోజున 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని జపించడంతో పాటు ఇష్టమైన వస్తువులను దానం చేయడం ద్వారా అక్షయమైన ఫలితం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ రోజు చేసే జప,తప, దానాలతో లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధిస్తుందట.


మాఘ పౌర్ణమి రోజున.. రాశుల వారికీ ఏయే వస్తువులను దానం చేయాలంటే..


మేష రాశి.. కూరగాయలు, ఆహార ధాన్యాలు, వస్త్రాలను దానం చేయాలి.


వృషభ రాశి.. శనగ పప్ప, పసుపు రంగు వస్త్రాలు, ఆవాల వంటివి దానం చేయడం ఎంతో ఉత్తమం.


మిథున రాశి.. ఎర్ర రంగు పప్పు, నీలి రంగు పూలు, పసుపు రంగు పండ్లు మామిడి, అరటి పండ్లు దానం చేయాలి.


కర్కాటక రాశి.. పాద రక్షలు, గొడుగు, నీల మణి, నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.


సింహ రాశి.. నీలి రంగు వస్త్రాలు, నీలమణి, కూరగాయలు దానం చేయడం అత్యుత్తమం.


కన్య రాశి.. గోధుమలు, ఎర్రపప్పు, రాగి, బెల్లం మొదలైన వాటిని దానం చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది.


తుల రాశి.. చందనం, మామిడి, అరటి పండ్లు.. ఇత్తడి వస్తువులు, పసుపు ఆవాలు, పసపు వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


వృశ్చిక రాశి.. పరిమళ ద్రవ్యాలు.. క్రీమ్ కలర్ వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


ధనుస్సు రాశి.. ఈ రాశి వారు తెల్లని వస్త్రాలు, ముత్యాలు, బియ్యం, పాలు, పంచదార, తెల్లని నువ్వులు దానం చేయాలి.


మకర రాశి.. పసుపు ఆవాలు, అరటి, మామిడి, ఇత్తడి మిఠాలయిలు, పసుపు వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


కుంభ రాశి.. బియ్యం, పంచదార, పాలు, తెల్ల చందనం, తెల్లని వస్త్రాలు, ముత్యాలు, వెండి దానం చేయడం అత్యంత శ్రయస్కరం.


మీన రాశి.. ఈ రాశి వారు కంచు, ధన ధాన్యాదులు, గోధుమలు, బెల్లం, నూనె, నీలి రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి.


Also Read: Muddapappu, Egg: ఏపీ రాజకీయాల్లో 'ముద్దపప్పు, కోడిగుడ్డు' రచ్చ.. ప్రజలకు మస్త్‌ వినోదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి