Astrology: గ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన కుజుడు  త్వరలో  మకరరాశిలో సంచరించబోతున్నాడు. పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి 5, 2024న, కుజుడు మకరరాశిలో ప్రవేవిస్తాడు. మరియు మార్చి 15, 2024 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులను కూడా ప్రభావితం చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిషశాస్త్రంలో అంగారుడు శక్తి,ధైర్యం, శౌర్యం, బలం, భూమి మరియు ధైర్యసాహసాలకు ప్రతీకగా పరిగణించబడుతాడు. కుజుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. మరికొంత మంది అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది.కుజ గ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారికి సమస్యలు ఫేస్ చేయవచ్చే మీరు ఓ లుక్కేయండి..


మిథున రాశి : డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఎవరినీ అంత ఈజీగా నమ్మవద్దు. మీ కెరీర్‌లో కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. పని ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి.న్యాయపరమైన విషయాల్లో ఆటంకాలు ఎదరు కావొచ్చు.


కర్కాటక రాశి : మీరు వివాహా జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. సంబంధాలలో విబేధాలు పెరిగే అవకాశాలున్నాయి. మీ భాగస్వామితో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. చిన్న చిన్న ఆరోగ్య
సమస్యలు ఫేస్ చేయవచ్చు.


సింహ రాశి: దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం బెటర్. అధిక ఖర్చులకు దూరంగా ఉండాలి. లేకపోతే మానసిక ఆందోళన గురి కావొచ్చు.ఫ్యామిలీ లైఫ్‌లో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.  


కన్య రాశి: సెంటిమెంట్స్ కారణంగా జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి.   వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదర్కొవడంపైనే మీ విజయం దాగుంది. తోటి ఉద్యోగులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి.  మీ బాస్ చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాల్లో పెద్దగా రిస్క్ తీసుకోకండి.


ధనుస్సు రాశి: ఈ రాశుల వారు మీరు గృహ సంబంధమైన సమస్యలను ఫేస్ చేయాల్సి రావొచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులతో ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు.


మకర రాశి : కోప,తాపాలకు దూరంగా ఉండాలి. మనసుకు ఆందోళన కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. దీంతో సంబంధాలలో వివాదాలు రావొచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రణాళికేతర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. .


పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.


ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..


ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook