COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mars-Venus-Mercury Conjunction in Leo: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక ఎంతో కీలకమైంది. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే 12 రాశుల వారిపై శుభ ప్రభావం పడుతుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో శుభ యోగాలు అని పిలుస్తారు. గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు రెండు రకాల యోగాలు ఏర్పడతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో శుభయోగాలు ఏర్పడితే మరికొన్ని సందర్భాల్లో ఆశుభ యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నెలలో శుక్ర, కుజ, బుధ సింహరాశిలో కలువ బోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశుల కలయిక ఎంతో శుభప్రదమైందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని పెంచబోతుందని వారు అంటున్నారు. ఈ గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రాశుల వారి జీవితాలు మారబోతున్నాయి:
మేష రాశి:

మూడు గ్రహాలు ఒకే చోట కలవడంతో మేష రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ క్రమంలో అదృష్టం రెట్టింపు అవ్వడమే కాకుండా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో మీ భాగస్వామితో మంచి సంబంధాలు కూడా ఏర్పడవచ్చు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నవారు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ఈ మూడు గ్రహాలు కలయిక కారణంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. క్రయవిక్రయాలు చేసేవారు ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..


మిథున రాశి:
మిధున రాశి వారికి ఈ గ్రహాల కలయిక కారణంగా ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు సులభంగా జరిగిపోతాయి ముఖ్యంగా కష్టపడి పనిచేసే వారికి ఈ నెలలో భారీ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి పనులు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మీ పిల్లలనుంచి కూడా శుభవార్తలు వింటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


సింహ రాశి:
శుక్ర, కుజ, బుధ గ్రహాలు సింహరాశిలో కలవడం వల్ల ఈ రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరికి ఇంతకుముందు ఎప్పుడూ ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ నెల మొత్తం కలసి వస్తుంది. ఇక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు భారీ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సింహరాశి వారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఇక పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు పొందుతారు.


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook