Astrology: 12 యేళ్ల తర్వాత రవి, గురు గ్రహాల అపూర్వ కలయిక.. ఈ మూడు రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..
Astrology - Guru - Sun Transit: గ్రహ మండలంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. అటు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల అక్కడే ఉన్న బృహస్పతితో కలిసి అద్బుత యోగం ఏర్పడబోతుంది.
Astrology - Guru - sun Transit: జ్యోతిష్యం ప్రకారం గురు, మరియు సూర్యుడు మిత్ర గ్రహాలు. ఈ రెండు కలయికల వల్ల ఆయా రాశులతో పాటు మరికొన్ని రాశుల వారికీ అత్యంత అనుకూలమైన ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు. ఇక సూర్యుడు త్వరలో మేషంలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు మేషంలోకి ప్రవేశించిన వెంటనే.. రవి, బృహస్పతిల అపూర్వ కలయిక ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారినీ ప్రభావితం చేస్తుంది. దాదాపు పుష్కర కాలం తర్వాత సూర్యుడు, బృహస్పతి మేషంలో కలవబోతున్నాయి. ఏప్రిల్ 13న గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన కారణంగా ఏ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయో మీరు ఓ లుక్కేయండి..
మేష రాశి:
సూర్యుడు మేష రాశి ప్రవేశం కారణంగా ఈ రాశివారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. సూర్యుడు, బృహస్పతి కలయిక ఎంతో శుభ ప్రదంగా భావించబడుతోంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. లవ్ లైఫ్ ఎంతో ఎగ్జైటింగ్‌గా సాగుతోంది. జీవిత భాగస్వామితో బంధం సాఫీగా సాగిపోతుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగు అవుతాయి.
మిథున రాశి:
మిథునంలో బృహస్పతి, రవి గ్రహాల కలయికల వల్ల మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అనేకల వనరుల నుండి ఆదాయాన్ని పొందే అవకాశాలున్నాయి. మీరు ఫ్యామిలీ నుంచి పూర్తి మద్ధతు పొందుతారు. మీ టాలెంట్‌తో కెరీర్‌లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపబే అవకాశాలున్నాయి.
సింహ రాశి:
సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల ఈ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు సంభవించనున్నాయి. ఈ సమయంలో మీరు పూర్తి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. లక్ కలిసొచ్చే అవకాశాలున్నాయి. చదువుకునే విద్యార్ధులకు ఇదే మంచి సమయం.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook