Astrology: కుజుడు నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం. ఈ గ్రహం అనుగ్రహం వలనే మనకు దైవభక్తితో పాటు శారీరక బలం చేకూరుతుంది. కుజుడు బలంగా ఉంటేనే పోలీసు, సైన్యం, రాజకీయాల్లో రాణిస్తారు. జూన్ 1 నుంచి అంగారకుడు మేషం రాశిలోకి ప్రవేశించనున్నాడు. అది జూలై 12వ వరకు ఆ రాశిలోనే ఉండనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికీ అనుకూలమైన ఫలితాలుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాలకు సర్వసైన్యాధ్యక్షుడైన కుజుడు తన స్వక్షేత్రం మేషరాశిలో సంచరించబోతున్నాడు. మేషంలో కుజ రాశి సంచారం వలన మేష రాశి వారికీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కుజుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 1వ తేదిన తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. 41 రోజులు పాటు కుజుడు తన స్వక్షేత్రంలో సంచరించబోతున్నాడు.


మేషరాశి..
కుజుడు తన స్వక్షేత్రం మేషరాశిలో సంచారం వలనల ఈ రాశి వారికి అదృష్టం వరించబోతుంది. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు. కెరీర్‌లో మీ పని అందరి చేత ప్రశంసించబడుతోంది. కుటుంబంలో గౌరవం పెగరుతోంది. ఈ సమయంలో మీరు శక్తివంతంగా ఉంటారు. కుటుంబం నుండి మద్ధతు లభిస్తుంది. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.


ధనుస్సు రాశి..
అంగారకుడు రాశి మార్పు ధనుస్సు రాశి వారికీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ధనం చేతికి అందుతుంది. మీ ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విదేశాలకు వెళ్లేందకు ఇదే అనువైన సమయం. జీవిత భాగస్వామి నుండి ఈ రాశి వారికీ పూర్తి మద్ధతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన జీవితం గడుపుతారు.


Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే


మీనరాశి
కుజ సంచారం మీనరాశి వారికీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సానుకూల
శక్తితో ఉంటారు. పనిపై దృష్టి కేంద్రీకరించబడుతోంది. మతపరమైన విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. మానసిక ఆరోగ్యం శ్రద్ధ వహించాలి. పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కాపాడుకోవాలి.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook