Benefits of Rajadhiraja Yog:  జాతకంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలను బట్టే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఈ గ్రహాలు కాలానుగుణంగా కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తాయి. ఇవి మీ జాతకంలో ఏర్పడితే మీరు కింగ్ లాంటి జీవితాన్ని గడుపుతారు. అలాంటి రాజయోగాల్లో రాజాధిరాజ యోగం ఒకటి. ఈ యోగం కుండలిలో ఏర్పడితే మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా మీకు డబ్బుకు లోటు ఉండదు. రాజాధిరాజ యోగం ఎలా ఏర్పడుతుంది, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతకంలో 1వ, 4వ, 7వ మరియు 10వ ఇంటిని విష్ణుస్థానం అంటారు. ఈ ప్రదేశాలను వేద జ్యోతిషశాస్త్రంలో కేంద్ర స్థానాలు అని కూడా అంటారు. అదేవిధంగా, కుండలిలో ఐదవ ఇల్లు మరియు తొమ్మిదవ ఇల్లు లక్ష్మీ స్థానంగా పిలుస్తారు. దీనినే త్రికోణ స్థానం అంటారు.  కేంద్రం అంటే విష్ణు స్థానం అని, త్రికోణం అంటే లక్ష్మీ స్థానం అంటారు. 


రాజయోగం యొక్క ప్రయోజనాలు
ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి 32 రకాల రాజయోగాలు వివిధ ఫలితాలను ఇస్తాయి. గ్రహాలు మీ జాతకం మధ్యలో లేదా త్రికోణ గృహంలో ఉంటే ఏర్పడే రాజయోగం శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.  అంతేకాకుండా రాజయోగం రెండవ లేదా పదకొండవ ఇంట్లో ఏర్పడినప్పటికీ అది శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు వృత్తి, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీకు గౌరవం మరియు ప్రతిష్ట లభిస్తుంది.


Also Read: Mars-Jupiter Yuti: నవపంచమ రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook