Astrology - Shani Dev: ఫిబ్రవరిలో 5 గ్రహాలు తమ రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించిన కారణంగా.. కొంత మంది జీవితం ఆనందదాయకంగా ఉంటే.. మరికొందరు తమ జీవితాల్లో కొన్ని కష్టనష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే రాశుల వారు జాగ్రత్త ఉండాలో తెలుసుకుందా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Astrology - Shani Gochar: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ మండలంలోని నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. వీటి కారణంగా 12 రాశులు ప్రభావితం అవుతుంటాయి. శని దేవుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది.


ఈయన న్యాయానికి అధిపతి. శని దేవుడు ప్రతి వ్యక్తి యెక్క వారి కర్మానుసారం ఫలాలను ఇస్తూ ఉంటాడు. సత్కార్యాలు చేసే వాళ్లకు శుభ ఫలితాలను అందిస్తే.. దుష్కర్మలు చేసే వాళ్లకు అదే రీతిలో శిక్షించడం శని దేవుడి లక్షణం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా శనీదేవుడి ఏల్నాటి శని ప్రభావం ఎదుర్కోవాల్సిందే.
 
శని రాశి మార్పు  కారణంగా కొన్ని రాశుల మీద శని గ్రహం యొక్కఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక్కో రాశిలో ఎక్కువ యేళ్లు ఉండటంతో ఈయనకు మందుడు, మంద గమనుడు అనే పేరు వచ్చింది.


శని గ్రహాన్ని పాపాత్మకమైన మరియు క్రూరమైన గ్రహంగా భావిస్తూ ఉంటారు. ఫిబ్రవరిలో శని దేవుడు,  సూర్య భగవానుడు, శుక్రుడు, అంగారకుడు తామున్న రాశి నుంచి వేరే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి.   ఈ కారణంగా ఫిబ్రవరిలో కొంత గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.  ఫిబ్రవరి 1వ  బుధుడు మకరంలోకి ప్రవేశించాడు. ఇక ఫిబ్రవరి 5న కుజుడు  కూడా మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. శని 11న అస్తమిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అటు ఫిబ్రవరి 12న శుక్రుని తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. మరకంలోకి ప్రవేశించనున్నాడు.


 ఫిబ్రవరి 13న సూర్యుడు తన మార్గాన్ని మార్చుకోనున్నాడు. మకరం నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఫిబ్రవరి నెలలో ఈ గ్రహాల గమనంలో వచ్చే మార్పులు కొన్ని రాశుల వారి జీవితంలో కొన్ని ఇబ్బందులను సృష్టించే అవకాశాలున్నాయి. కాబట్టి శని దేవుడు, సూర్యుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు రాశుల మార్పు వల్ల ఏ రాశుల వారికి కష్ట కాలం మొదలవుతుందో చూద్దాం..


మిథునం..


శని దేవుడు, రవి, శుక్రుడు, కుజుడు తామున్న రాశి నుంచి వేరే రాశిలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ టైమ్‌లో మీరు ఆస్తి లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటపుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేయవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి శని దేవుడు, సూర్యుడు, శుక్రుడు, అంగారకుడి గ్రహాల గమనం మార్పువల్ల మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్య సంబంధించిన సమస్యలు రావచ్చు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


మీన రాశి:


మీన రాశి వారికి గ్రహ మార్పు కారణంగా వీరి జీవితాల్లో పలు మార్పులు సంబవించనున్నాయి. ఫ్యామిలీ మ్యాటర్స్‌తో పాటు జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావచ్చు. ఆర్ధికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.



Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: Post Office MIS: పోస్ట్ఆఫీస్ బంపర్ ఆఫర్..జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేచాలు రూ.5 లక్షలు




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook