Lucky Boys Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని 12 రాశులకు ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా రాశులను బట్టి ఆ వ్యక్తుల స్థితి గతులు, గుణ గణాలు అంచనా వేయవచ్చు. అందుకే కొంతమంది పెళ్లిళ్లలో జాతకాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. జాతకాలు కలిస్తేనే పెళ్లికి సిద్ధపడుతారు. ఆ సంగతి అలా ఉంచితే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 3 రాశుల అబ్బాయిలంటే అమ్మాయిలు చాలా ఇష్టపడుతారట. ఆ 3 రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి (Gemini) : ఈ రాశి అబ్బాయిలకు హాస్య చతురత ఎక్కువ. అమ్మాయిలను నవ్వుల్లో ముంచెత్తగలరు. నవ్వించడం ద్వారానే అమ్మాయిల మనసు గెలుచుకోగలరు. ఈ రాశి వారు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే.. ఆమె సంతోషం కోసం ఏదైనా చేస్తారు. మంచి వ్యక్తిత్వం, రొమాంటిక్ నేచర్, హాస్యం, అన్నీ కలగలిసి ఈ రాశుల వారిని అమ్మాయిలు ఇట్టే ఇష్టపడుతారు.


కన్య రాశి (Virgo) : కన్య రాశి అబ్బాయిలు చాలా రొమాంటిక్. అమ్మాయిల మనసులను సులువుగా గెలుచుకుంటారు. వారి మనసులో ఏముందో తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరిస్తారు. రొమాంటిక్‌గా ఆకట్టుకుంటారు. తద్వారా అమ్మాయిలకు ఈ అబ్బాయిలంటే చాలా నచ్చుతుంది. 


సింహం (Leo) : సింహ రాశి అబ్బాయిలు మాటకారులని చెప్పాలి. మాటలతోనే అందరిలో గుర్తింపు పొందుతారు. సోషల్ లైఫ్‌ గడిపేందుకు ఇష్టపడతారు. అమ్మాయిలతో రొమాంటిక్‌గా ఉంటారు. ఈ స్వభావంతో అమ్మాయిల మనసును గెలుచుకోగలరు.


Also Read: HEAVY RAINS:తెలంగాణలో స్కూళ్లకు మూడు రోజులు సెలవు... కుండపోత వానలతో సర్కార్ అలెర్ట్


Also Read: Samosa: సమోసాలు, పకోడాలు తరుచుగా తింటున్నారా.. అయితే మీకు కాన్సర్స్‌ సమస్యలు తప్పవు..!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook