Mercury Transit: రాబోయే 24 గంటల్లో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. బుధ సంచారంతో అంతా శుభమే..
Mercury Tranist in Cancer July 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే 24 గంటల్లో 3 రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుంది. కర్కాటకంలో బుధ సంచారం వీరికి అంతా శుభమే జరగనుంది.
Mercury Tranist in Cancer July 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం, రాశి మార్పు రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఇది కొందరికి సత్ఫలితాలనిస్తే.. మరికొందరికి అశుభం కలగజేస్తుంది. గ్రహాల ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడేందుకు జ్యోతిష్యశాస్త్రంలో పరిహారాలు కూడా సూచించబడ్డాయి. కాబట్టి గ్రహాల మార్పు ఎవరిపై చెడు ప్రభావం చూపుతుందో తెలిస్తే పరిహార మార్గాలు అనుసరించవచ్చు. ఈ నెల 17న బుధ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. ఈ ప్రభావం 3 రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వనుంది. ఆ రాశులేంటో.. ఎలాంటి శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
మిథునం (Gemini) - మిథున రాశిలో బుధ సంచారం ద్వితీయ స్థానంలో ఉంటుంది. ఇది సంపదకు సంకేతం. బుధ సంచారం మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలగజేస్తుంది. వ్యాపారులకు పూర్తి అనుకూల సమయం. ఉత్పత్తి రంగంలో ఉన్న వ్యాపారులకు పెద్ద ఆర్డర్స్ లభిస్తాయి. తద్వారా ఒకేసారి భారీ ఎత్తున ధనం చేకూరుతుంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. అలాగే, మార్కెటింగ్ ఉద్యోగులు, కార్మికులు, టీచర్లకు ఇది శుభకాలం. ఈ కాలంలోపన్నా రత్నం ధరిస్తే మీ అదృష్టం రెట్టింపవుతుంది.
కన్య (Virgo)- కన్య రాశి వారి జాతకంలో బుధుడు 11వ ఇంట్లో సంచరిస్తాడు. బుధ సంచారం ఈ రాశి వారికి అనేక లాభాలు కలగజేస్తుంది. ఉద్యోగ, వ్యాపారులకు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. చేపట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. జీవిత భాగస్వామితో బంధం మాధుర్యంగా సాగుతుంది. కన్య రాశికి బుధుడే అధిపతి కాబట్టి ఈ కాలమంతా వారికి సానుకూల ఫలితాలనిస్తుంది. ఒనిక్స్ రత్నం వీరికి అదృష్టమని చెబుతారు.
తుల (Libra) - తుల రాశిలో బుధుడు 10వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. వ్యాపార విస్తరణ ఆర్థికపరంగా కలిసొస్తుంది. ఈ కాలంలో మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మునుపటి కన్నా పనిలో బాగా రాణిస్తారు. తద్వారా మీ సహోద్యోగుల ప్రశంసలు దక్కుతాయి. ఒపాల్ రత్నం తులారాశికి అదృష్టమని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫేనా? మరో నాలుగు గంటలు గడిస్తేనే.. పోలవరంలోనూ హై టెన్షన్
Also Read: Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలకు రేవంత్ రెడ్డి గాలం! రాహుల్ సిరిసిల్ల సభలో సంచలనం?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.