Astrology: ఈ 5 వస్తువులు చేజారి కింద పడ్డాయా... అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే లెక్క..!
Jyotish Shastra: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని వస్తువులు చేజారి పడిపోవడం అశుభానికి సంకేతం. దీని అర్థం మీకు భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చని.
Bad Luck Signs: మనం తరుచూ ఏదో ఒక పనిచేస్తున్నప్పుడు కొన్ని వస్తువులు చేజారి కింద పడిపోతు ఉంటాయి. దానిని మనం పెద్దగా పట్టించుకోం. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని వస్తువులు చేజారి పడిపోవడం అశుభంగా పరగణిస్తారు. రాబోయే రోజుల్లో మీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం.
ఉప్పు (Salt) : ఉప్పు ఎవరికీ అప్పు ఇవ్వకూడదని పెద్దలు అంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు వంట చేస్తున్నప్పుడో లేదా డైనింగ్ టేబుల్ పై పనిచేస్తున్నప్పుడో ఉప్పు కింద పడిపోతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఉప్పు కింద పడటం అశుభం. ఉప్పు పడిపోవడం శుక్రుడు మరియు చంద్రుని బలహీనతకు సంకేతం అని చెబుతారు. ఈ కారణంగా, మీరు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
నూనె (Oil): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పొరపాటున మీ చేతుల నుండి నూనె పడిపోయినట్లయితే, అది అశుభ సంకేతం. తరచుగా నూనె చిందటం అంటే మీ జీవితంలోకి సమస్యలు రాబోతున్నాయని అర్థం. కాబట్టి నూనెను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
పూజ పల్లెం (Puja plate): మీరు పూజ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మీ చేతి నుండి పూజా పళ్ళెం పడిపోతే, దేవుడు కరుణ మీపై లేనట్లే లెక్క. భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుందని అది సూచిస్తుంది.
పాలు (Milk): పొరపాటున మీ చేజారి పాలు నేలపాలైతే... అప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం, అది అశుభానికి సంకేతం, ఎందుకంటే పాలు చంద్రునికి సంబంధించినవి అని నమ్ముతారు మరియు పాలు కింద పడటం జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తెస్తుంది.
ఆహారం (Food): సాధారణంగా మీరు ఆహారం తినేటప్పుడు లేదా వడ్డించేటప్పుడు కొంచెం పుడ్ కింద పడిపోతుంది. ఇలా జరగడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వల్ల మీరు పేదవారిగా మారవచ్చు.
Also Read: కన్యారాశిలో బుధ సంచారం... ఈ రాశుల వారికి ధనప్రాప్తి, కెరీర్ లో పురోగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook