Personality by Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి స్థితిగతులనే కాదు ఆ వ్యక్తి గుణగణాలను కూడా తెలుసుకోవచ్చు. వ్యక్తుల రాశుల ద్వారా వారి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. రాశిక్రంలోని 12 రాశుల్లో ఏ రాశి వారి వ్యక్తిత్వం, స్వభావం ఎలా ఉంటుందో జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రం ప్రకారం 3 రాశులకు చెందిన అమ్మాయిలు అందరినీ ఇట్టే ఆకర్షించగలరు. ఆ 3 రాశులేంటో.. వారిలో ఆకర్షించే గుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)


వృషభ రాశి స్త్రీల చిరునవ్వు, మాట తీరు, వ్యవహార శైలి, మొత్తంగా వారి వ్యక్తిత్వంలోనే తెలియని ఆకర్షణ ఉంటుంది. వీరితో ఎవరైనా కాసేపు మాట్లాడితే.. ఇట్టే ఆకర్షణలో పడిపోతారు. ఈ స్త్రీలు ఎక్కడికెళ్లినా సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. ఈ అమ్మాయిలకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు.


మిథునరాశి (Gemini)


ఈ రాశి స్త్రీలు చాలా తెలివైనవారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడరు. ఉన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పగలరు. ఈ అమ్మాయిల ముక్కుసూటితనం, ధైర్యం ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ ఉత్సాహంగా, చిరునవ్వుతో కనిపిస్తారు. ఇతరుల పట్ల దయాగుణంతో ఉంటారు


వృశ్చిక రాశి (Scorpio)


వృశ్చిక రాశి స్త్రీలు అందమైన వారు. అందంగా తయారైతే చూపు తిప్పుకోవడం కష్టం. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాలు తీసుకోగలరు. ఎదుటివారి పరిస్థితిని, మనసును సులువుగా అర్థం చేసుకోగలరు. ఈ అమ్మాయిలను ఎవరు కలిసినా ఫస్ట్ మీటింగ్‌లోనే ఆకర్షణకు గురవుతారు.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ఈ సమాచారాన్ని జీ మీడియా ధ్రువీకరించలేదు. )


Also Read: Saturn transit effect: శనిగ్రహ సంచారం... త్వరలో మారనున్న ఈ 3 రాశుల అదృష్టం..!


Also Read: Mangala Gauri Vrat 2022: ఒకేరోజు శివరాత్రి, మంగళ గౌరీ వ్రతం... శుభముహూర్తం తెలుసుకోండి


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook