Moles and Signs: పుట్టుమచ్చలకు ఓ శాస్త్రముంది. శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చలుంటే ఏం జరుగుతుంది. మంచిదా కాదా అనే ప్రస్తావన ఉంది. మరి మీ కాలి పాదంపై పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది..ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే అత్యంత అదృష్టవంతులౌతారు..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఇంట్లో స్త్రీ లక్ష్మీదేవికి ప్రతిరూపమని భావిస్తారు. అందుకే ఇంట్లో ఆడపిల్లలకు గౌరవం, మర్యాద తప్పకుండా ఇవ్వాలి. దీనివల్ల ఇంట్లో ఆదా అవడమే కాకుండా..డబ్బుకు లోటుండదు. అదే సమయంలో కొంతమంది మహిళలకు నిర్ణీతమైన చోట..పుట్టుమచ్చ ఉంటే ఆ మహిళలు అత్యంత అదృష్టవంతులని అర్ధం. దాంతోపాటు అత్తారింటివారికి శుభసూచకంగా మారతారు. అయితే కాళ్లపై ఎక్కడెక్కడ పుట్టుమచ్చలుంటే మంచిదనేది తెలుసుకుందాం..కాళ్లలో ఏ భాగంలో పుట్టుమచ్చలుంటే ఏం జరుగుతుందనేది పరిశీలిద్దాం..


1. ఎవరైనా మహిళ మడమ భాగంపై పుట్టుమచ్చ ఉంటే..ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని అర్ధం. కానీ తన పనుల కారణంగా భవిష్యత్తులో మంచి అనుభవం ఎదురౌతుంది. ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఏర్పడదు.


2. మధ్య వేలిపై పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టవంతులని అర్ధం. ఈ వేలు శని వేలుగా చెబుతారు. అందుకే మహిళలకు ఆ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే..అందరిలో పేరు తెచ్చుకోవడమే కాకుండా..అంతులేని డబ్బు సంపాదిస్తుంది ఆ మహిళ. 


3. మహిళ బొటనవేలుపై పుట్టుమచ్చ ఉంటే..అత్యంత సౌభాగ్యవంతురాలు, వైభవశాలి అని అర్ధం. జ్యోతిష్యం ప్రకారం బొటనవేలిపై పుట్టుమచ్చనేది కేవలం డబ్బు లోటును పూర్తి చేయడమే కాకుండా..ఉన్నత పదవుల్ని కూడా అందిస్తుంది. 


4. ఒకవేళ మహిళ పాదం అడుగుభాగంపై పుట్టుమచ్చ ఉంటే..ముఖ్యంగా సరిగ్గా మధ్యభాగంలో ఉంటే అలాంటి మహిళ లెక్కలేనంతగా డబ్బు, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఆ మహిళ అత్యంత తెలివైనదవుతుంది. దాంతోపాటు చుట్టుపక్కలుండేవారికి కూడా ఎప్పుడూ డబ్బు సమస్య రాదు. 


Also read: Pigeon Signs of Good Luck: మీ ఇంటికి పావురం తరచూ వస్తోందా..పావురం ఈకతో ఇలా చేస్తే అంతులేని సంపద మీదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook