Lakshmi Devi Remedies: ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. లేకపోతే దివాళా తప్పదు. అంతేకాదు..కొన్ని పద్ధతులు మార్చుకోకపోతే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ దరి చేరదు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీదేవిని ధనదేవతగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో..అతని జీవితంలో ప్రతి సుఖం, ప్రతి సౌకర్యం కలుగుతుంది. ఎవరికైతే లక్ష్మీదేవి ఆశీస్సులుంటాయో ఆ వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక గ్రంధాలు, జ్యోతిష్యంలో కూడా లక్ష్మీదేవి మహిమ, దేవిని ప్రసన్నం చేసుకునే చాలా మార్గాల గురించి ప్రస్తావన ఉంది. కానీ ఏ విధమైన మార్గాలు ఆచరించకుండానే..కొన్ని విషయాల్ని గుర్తుంచుకుంటే..ఎప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం సాధించవచ్చు.


జ్యోతిష్యశాస్త్రంలో కొంతమందికుండే కొన్ని చెడు అలవాట్ల గురించి వివరించి ఉంది. ఆ అలవాట్లతో ఆ మనిషి నాశనమైపోతాడు. దివాళా తీస్తాడు. అంతేకాదు సకాలంలో ఈ చెడు అలవాట్లను మానకపోతే..ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. ఆ చెడు అలవాట్లేంటో తెలుసుకుందాం..


శాస్త్రాల్లో సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవడం ఉత్తమమని ఉంది. బ్రహ్మ ముహూర్తంలో లేవడం శుభప్రదమని అంటారు. ఏ వ్యక్తి అయితే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేస్తాడో..అతనిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. లేకపోతే ఉండదు. అటు సాయంత్రం వేళ నిద్రపోవడం కూడా అశుభం. సాయంత్రం నిద్రపోతే..ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేముందు ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ వ్యక్తి ఇంట్లో శుభ్రత ఉండదో ఆ ఇంట్లోంచి లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది. నిర్ణీత పద్ధతిలో ఉదయం వేళ శుభ్రం చేయాలి. జ్యోతిష్యశాస్త్రం, ధార్మిక గ్రంధాల ప్రకారం..చాలామంది ఉప్పుని చేతుల్లో ఇచ్చేస్తుంటాం. కానీ అలా చేయకూడదు. ఈ అలవాటు వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఉప్పు ఇచ్చేటప్పుడు ప్లేట్‌లో పెట్టి ఇవ్వాలి. శాస్త్రాల ప్రకారం..అన్నం లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. చాలామంది ప్లేట్లలో ఎంగిలి భోజనం వదిలేస్తుంటారు. అన్నం వృధా చేయడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టముండదు. అన్నాన్ని పాడు చేస్తే..ఇంట్లో, కుటుంబంలో దరిద్రం వెంటాడుతుంది. 


Also read: Tuesday Remedies: మంగళవారం ఇలా పూజలు చేస్తే..ఇక మీకు తిరుగులేదు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook