Tuesday Remedies: వారంలో ప్రతిరోజుకీ ఓ ప్రత్యేకత ఉంది. మంగళవారం హనుమంతుడికి సమర్పితం. హనుమంతుడికి సంకట విమోచనుడనే పేరు కూడా ఉంది. అంటే కష్టాల్ని దూరం చేసేవాడని అర్ధం. అందుకే ప్రతి మంగళవారం ఆ పనిచేస్తే..అన్ని కష్టాలు దూరమౌతాయిట...
హిందూ ధర్మంలో ప్రతి రోజూ ఏదో ఒక దేవుడికి ప్రత్యేకం. మంగళవారం రోజు హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో అన్ని పనులూ శుభప్రదమౌతాయని నమ్మకం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం నాడు చేయాల్సిన కొన్ని పద్ధతులు, మార్గాలున్నాయి.ఇవి చేయడం వల్ల వ్యక్తి కుండలిలో మంగళగ్రహం బలోపేతమవుతుంది. మంగళగ్రహం బలంగా ఉంటే..సాహసం, పరాక్రమం పెరుగుతుంది. వ్యక్తి జీవితంలో మంగళగ్రహం పటిష్టంగా ఉంటే సంబంధిత జాతకులకు సంపద లభిస్తుంది. జీవితంలో భయమనేది ఉండదు. మంగళవారం నాడు కొన్ని ఉపాయాలు ఆచరిస్తే..ఆ వ్యక్తికి సంబంధించిన కష్టాలన్నీ దూరమౌతాయి.
మంగళవారం నాడు చేయాల్సిన పనులు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం స్వచ్ఛమైన మనస్సుతో పూర్తి భక్తితో మంగళవారం హనుమంతుడి పూజ చేస్తే ఆ వ్యక్తి దుఖాలన్నీ దూరమౌతాయి. జ్యోతిష్యం ప్రకారం..ఎర్రపూలు, ఎర్ర పండ్లు, ఎర్ర చందనం, ఎర్ర రంగు వస్త్రాలు, ఏదైనా ఎరుపు స్వీట్ హనుమంతుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కోర్కెలు నెరవేరుతాయి. మంగళవారం నాడు ఏదైనా హనుమంతుడి మందిరంలో హనుమంతుడికి సింధూరం, అత్తరు, బెల్లం, సంపెంగ నూనె, కొబ్బరికాయ, పాన్, శెనగలు వంటివి సమర్పించాలి. దాంతోపాటు స్వయంగా బెల్లం తిని..అందరికీ పంచిపెట్టాలి.
మీరు మీ కుండలిలో మంగళగ్రహాన్ని పటిష్టం చేయాలనుకుంటే..మంగళవారం నాడు నీళ్లలో బెల్లం, నువ్వులు వేసి పారబోయాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి మరింత పరాక్రమవంతుడౌతాడు. ఒకవేళ మీకు ఆర్ధికంగా సమస్యలుంటే..వరుసగా 5 మంగళవారాలు హనుమంతుడి ఆలయంలో ధ్వజమెక్కించాలి. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఎవరి కుండలిలోనైనా మంగళ గ్రహం అశుభంగా ఉంటే..ఆ వ్యక్తి తెల్ల సుర్మా లేదా నలుపు సుర్మా రాసుకోవాలి.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook