Navgrah Remedies: జ్యోతిష్యం (Astrology) అనేది రాబోయే భవిష్యత్తు గురించి తెలుపుతుంది.  దీని ద్వారా చాలా వరకు అవాంఛనీయ సంఘటనలను నివారించవచ్చు. వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం సరిగ్గా లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆ వ్యక్తిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. నవగ్రహ దోషం (Navgrah Dosh) నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.  
సూర్యుడు (Sun) : మీరు సూర్య గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించాలనుకుంటే.. ఎరుపు పువ్వులు, ఏలకులు, కుంకుమపువ్వు మరియు రోజ్మేరీని కలిపి స్నానం చేయండి.
చంద్రుడు (Moon): మీరు చంద్రుని ప్రతికూల ప్రభావాలను నివారించాలనుకుంటే.. తెల్లటి చందనం, తెల్లటి సువాసన గల పువ్వులు, రోజ్ వాటర్ లేదా శంఖం చిప్పలో నీటిని నింపి స్నానం చేయండి.
అంగారకుడు (Mars): అంగారకుడి వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడానికి.. స్నానం చేసే నీటిలో ఎర్రచందనం, బెరడు, బెల్లం కలిపి స్నానం చేయండి. ప్రయోజనం ఉంటుంది.
బుధుడు (Mercury):  మీరు బుధ గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించాలనుకుంటే, స్నానపు నీటిలో జాజికాయ, తేనె, బియ్యం కలుపుకుని స్నానం చేయండి.
బృహస్పతి (Jupiter): మీరు బృహస్పతి గ్రహం యొక్క చెడు ప్రభావాలను నివారించాలనుకుంటే, స్నానం చేసే నీటిలో పసుపు ఆవాలు, చింతపండు మరియు మల్లెపూలు కలుపుకుని స్నానం చేయండి.
శుక్రుడు (Venus): శుక్రగ్రహం వల్ల కలిగే దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలంటే స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్, యాలకులు, తెల్లటి పువ్వులు వేసి స్నానం చేస్తే మేలు జరుగుతుంది.
శని (Saturn): మీరు శని యొక్క అశుభ ప్రభావం తగ్గాలంటే, మీరు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, మెంతులు, యాంటీమోనీ లేదా సుగంధ ద్రవ్యాలు కలిపి కూడా స్నానం చేయవచ్చు.
రాహువు (Rahu): మీరు రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించాలనుకుంటే, స్నానం చేసే నీటిలో కస్తూరి, సుగంధ ద్రవ్యాలు కలుపుకుని స్నానం చేయండి.
కేతువు (Ketu): కేతువు బాధలు తొలగాలంటే స్నానపు నీళ్లలో ధూపం, ఎర్రచందనం కలుపుకుని స్నానం చేస్తే మేలు జరుగుతుంది.