Shani Dev Grace: హిందూమతంలో..జ్యోతిష్యశాస్త్రంలో శనికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి ఒక్కరూ శని కటాక్షం ఉండాలనే భావిస్తారు. మీలో ఈ లక్షణాలుంటే..శని కటాక్షం మీపై తప్పకుండా ఉండటమే కాకుండా..అంతులేని సంపదలు లభిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడికి లేదా శని గ్రహానికి జ్యోతిష్యశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ తమపై శని పీడ ఉండకూడదని..ఆ స్థానంలో శని కటాక్షం ఉండాలని కోరుకుంటారు. శని కటాక్షం కోసం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. శనిదేవుడి కటాక్షం లేదా శనిపీడ అనేది ఆ వ్యక్తి చేసే పనులు అంటే కర్మల్ని బట్టి ఉంటుంది. 


అందుకే శనిని న్యాయదేవతగా పిలుస్తారు. మనిషి చేసే మంచి పనులు, చెడు పనులకు అతనే ప్రతిఫలాన్నిస్తాడు. చెడు పనులు చేస్తే శని వక్రదృష్టి ఉంటుంది. అతడి జీవితం దుఖాలతో, నష్టాలతో నిండిపోతుంది. అదే మంచి పనులు చేస్తే శని కటాక్షం ఉంటుంది. ఒకసారి శని కటాక్షం లభిస్తే..ఆ మనిషికి ఇక జీవితంలో దేనికీ కొదవుండదు. స్థూలంగా చెప్పాలంటే చేసే మంచి పనుల ద్వారా శని కటాక్షం పొందవచ్చు.


ఇంట్లో పూర్వీకుల క్రియాకర్మలు పూర్తి నిష్టతో, శ్రద్ధతో అంత్యక్రియలు జరిపిస్తే ఆ వ్యక్తిపై శని కటాక్షం ఉంటుంది. ఇలా చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై అన్ని కష్టాలు దూరం చేస్తాడజు. పూర్వీకులకు శనివారం, అమావాస్యనాడు శని పూజ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.


శనిదేవుడికి శుచి శుభ్రత చాలా ఇష్టం. అందుకే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శారీరకంగా కూడా ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలి. గోర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. పెరగకుండా చూసుకోవాలి. శుచి శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారిని శని ఎప్పుడూ పీడించడు.


రావిచెట్టుకు పూజ చేయడం ద్వారా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం సాయంత్రం రావిచెట్టుకు దీపం వెలిగించాలి. రావిచెట్టుకు పూజించడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడౌతాడు. దాంతోపాటు శని కటాక్షం కోసం రావి మొక్క కూడా నాటుకోవాలి.


శనివారం నాడు వ్రతం ఆచరించడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడౌతాడు. శని కటాక్షం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండటంతో పాటు దానాలు కూడా చేయాలి. పేదలు, ఆపన్నులకు భోజనం పెట్టడం వల్ల శనిదేవుడి విశేష కృప కలుగుతుంది. ఇంట్లో ఎటువంటి కొరత ఉండదు.


Also read: Sun Transit 2022: సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం, ఆ 4 రాశులకు సెప్టెంబర్ 17 వరకూ కష్టాలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook