Astrology Venus Transit: నవగ్రహాల్లో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందానికి, ఆకర్షణకు, డాంబికానకి ప్రతిరూపం. శుక్రుడి వల్లే పలు ఆనంద యోగాలు మనిషి జీవితంలో వస్తుంటాయి. అంతేకాదు శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం, భార్య భర్తలతో అనురాగానికి శుక్రుడు కలిగిస్తాడు. అయితే శుక్ర గ్రహం జూలై 2024న కర్కాటకం నుంచి సూర్య రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహరాశిలో శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకురానున్నాయి. అంతేకాదు లక్ష్మీ దేవి అనుగ్రహంతో కొన్నేళ్లుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  శుక్రుడు రాశి మార్పు వలన ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి:  
వృషభ రాశి వారికి శుక్ర సంచారం వలన అనుకోని లాభాలు కలుగనున్నాయి.వృత్తి వ్యాపారల్లో అనుకోని  లాభాలు కలగనున్నాయి.  సరికొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యక్తి వివాహా జీవితంలో ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశుల వారు భూమి మరియు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంపద పెరుగుతుంది. ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ అందుకునే అవకాశాలున్నాయి.  



సింహ రాశి:


శుక్ర రాశి మార్పు సింహ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది.  ఉద్యోగ, వ్యాపారాలలో అనుకోని అభివృద్ది ఉంటుంది.  మీ కెరీర్‌లో గొప్ప విజయాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆకస్మిక ధన  లాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల వల్ల మీ జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. వివాహాం కానీ వారికీ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కుతారు. కొన్నేళ్లుగా పడుతున్న ఆర్ధిక కష్టాలు తొలిగిపోతాయి.



తుల రాశి:
శుక్రుని రాశిలో మార్పు తుల రాశి అనుకోని ప్రయోజనాలు కలుగనున్నాయి. ఇంట్లో ధన ప్రవాహం ఏరులై పారుతుంది.  ఆదాయంలో వృద్ధి ఉంటుంది.  సుఖాలలో జీవితాన్ని ఆనందంగా లీడ్ చేస్తారు.  ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్. వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  పిల్లల నుంచి వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు.


పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.


Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం


Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి