Indra Yogam benefits: ఆస్ట్రాలజీలో యోగాలు చాలా ముఖ్యమైనవి. గ్రహాల యెుక్క వివిధ ప్రభావాల కారణంగా ఇవి ఏర్పడతాయి. ఈ యోగాలలో జన్మించిన వ్యక్తి యెుక్క జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఆస్ట్రాలజీలో మెుత్తం 27 రకాల యోగాలు చెప్పబడ్డాయి. ఇందులో గజకేసరి యోగం, రుచక్ యోగం, భద్రయోగం మరియు హన్స్ యోగం మెుదలైనవి. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన ఇంద్రయోగం(Indra Yogam) గురించి చెప్పుకుందాం. ఈ యోగం జాతకంలో ఎలా ఏర్పడుతుంది? దాని వల్ల కలిగే లాభాలు ఏమిటో? తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంద్ర యోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న 27 యోగాలలో ఇంద్ర యోగం శుభ యోగం. ఒక వ్యక్తి జాతకంలో ఈ యోగం ఏర్పడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అంతేకాకుండా ఆ వ్యక్తి కెరీర్ లో పురోగతి ఉంటుంది. 


ఇంద్రయోగం ఎలా ఏర్పడుతుంది?
ఒక వ్యక్తి యొక్క జాతకంలో చంద్రుని నుండి మూడవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరియు శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇంద్ర యోగం ఏర్పడుతుంది. మరోవైపు, శని నుండి ఏడవ ఇంట్లో శుక్రుడు,  వీనస్ నుండి ఏడవ ఇంట్లో బృహస్పతి ఉండాలి. 


ఇంద్ర యోగం  ప్రయోజనాలు:
>> తులరాశి వ్యక్తికి ఇంద్రయోగం అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తికి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతను ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడుస్తాడు. ధనలాభం ఉంటుంది. జాతకంలో ఈ యోగం ఉన్నవాడు చాలా తెలివైనవాడు. 
>> ఎవరి జాతకంలో ఇంద్రయోగం ఏర్పడుతుందో.. ఆ వ్యక్తి చాలా తెలివైన వాడు అవుతాడు. రాజకీయ నాయకుడు అయ్యే అవకాశం ఉంది. ఇతడికి ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. వీరు అపారమైన సంపదను పొందుతారు. ఈ యోగం ఉన్న వ్యక్తికి సమాజంలో గౌరవం మరియు కీర్తి లభిస్తాయి.  


Also Read: Putrada Ekadashi 2022: శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook